అదానీ రహస్యంగా హైదరాబాద్ వచ్చారు. హోటల్ ఐటీసీ కోహినూర్ లో బస చేశారు. ఆయనతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సునీల్ కనుగోలు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు. రహస్య డీల్స్ ఏమిటో చెప్పాలన్నారు. కొండా సురేఖ ఇష్యూతో బిజీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని కూడా హైలెట్ చేసింది. అయితే కాంగ్రెస్ వైపు నుంచి స్పందన రాలేదు. అసలు అదానీతో భేటీ పై స్పందించలేదు.
పొంగులేటి రాష్ట్ర మంత్రి. ఓ బడా పారిశ్రామిక వేత్తను రహస్యంగా కవాల్సిన పని లేదు. అది కూడా పొలిటికల్ స్ట్రాటజిస్టును వెంట బెట్టుకుని. పూర్తిగా పార్టీ పరమైన వ్యవహారాలతో కలిస్తే అదే విషయాన్ని ప్రకటించాలి. కానీ అదానీతో పార్టీ వ్యవహారాలపై ఏం చర్చిస్తారు ?. పొంగులేటి వ్యాపారస్తుడు కాబట్టి.. ఆ విషయంపై చర్చిస్తే ఆ విషయాలు చెప్పాలి .. అలాంటప్పుడు సునీల్ కనుగోలు ఈ చర్చల్లో ఎందుకు పాల్గొన్నారన్న ప్రశ్నలు వస్తాయి.
అందుకే పొంగులేటి , అదానీ భేటీపై అనేక సందేహాలు వస్తున్నాయి. అదానీని వ్యవస్థాగతంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకిస్తుంది. ఈ భేటీలపై వారికి సమాచారం ఉందా .. ఈ భేటీ ఎజెండాఏమిటో వారికి తెలుసా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ భేటీ మాత్రం అంతర్గతంగా ప్రకంపనలు రేపుతోంది.