కూటమిలో విబేధాలొస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశపడుతున్నారు. షెడ్డుకెళ్లిపోయిన నేతలకు పార్టీ పగ్గాలిచ్చి వాటినే పెద్ద పదవుల్లా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సజ్జల.. అలాంటి సమావేశాల్లో తన ఆశల్ని వెల్లడించడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. గుంటూరులో జరిగిన ఓ సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి కూటమి పార్టీల మధ్య విబేధాలొస్తాయని ప్రభుత్వం నడవదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు ఉన్నంత కాకపోయినా ఎదుట వారికి కాస్తంత అయినా తెలివి ఉంటుందని సజ్జల, జగన్ అనుకోరు. టీడీపీకి మెజార్టీకి కావాల్సిన దాని కన్నా యాభై మంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇక్కడ కూటమి పార్టీల మధ్య విబేధాలొస్తే తాము బతికేయవచ్చని సజ్జల అనుకుంటున్నారు . అందుకే ఈ విధంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వినిపిస్తున్న హిందూత్వ వాదంతో తమ పుట్టి మునిగిపోతుందని సజ్జల భయపడుతున్నారు. అందుకే పవన్ హిందూత్వ వాదం బీజేపీకి నచ్చడం లేదని ఆయనపై కోపంతో ఉందని చెప్పుకొస్తున్నారు . హిందూత్వ వాదం బలపడితే ముందుగా లాభపడేది బీజేపీనే. దానిపై బీజేపీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
చచ్చు సలహాలు.. పుచ్చు తెలివి తేటలతో జగన్ రెడ్డిని నిండా ముంచిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికీ అదే బాటలో ఉండటం…అందర్నీ పిచ్చి పిచ్చి లాజిక్కులతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇతర నేతలకు నచ్చడం లేదు. అర్జంట్‌గా ఆయనను పక్కన పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదట.