ప్రకాష్ రాజ్ తమిళనాడులో డీఎంకే నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ పార్టీ నేత తిరుచ్చి శివ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం అది. అందులోనూ పవన్ కల్యాణ్ గురించి పరోక్ష ప్రస్తావన చేసి మానసిక ఆనందం పొందారు. ఓ ఫోటో తీసుకుని తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నారు. అదో గొప్ప అచీవ్ మెంట్ అన్నట్లుగా ఆయన ఫీలయ్యారు. కానీ దానికి మార్క్ ఆంధోనీ అనే సినిమా నిర్మాత వినోద్ కుమార్ ఇచ్చిన రిప్లై మాత్రం ప్రకాష్ రాజ్ నీతులు చెప్పే ముందు తనను తాను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని బలంగా కల్పిస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ వల్ల సెట్లో తనకు రూ.కోటి నష్టం జరిగిందని..క్యారవాన్ నుంచి కనీసం సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారని నిర్మాత వినోద్ కుమార్ మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ తన ఫోటోలో పెట్టుకున్న మిగతా ముగ్గురూ ప్రజల నుంచి గెలిచి వచ్చారని కనీసం ఆయన డిపాజిట్ తెచ్చుకోలేదని సెటైర్ వేశారు. ప్రకాష్ రాజ్ కు .. వినోద్ కుమార్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. విశాల్ హీరోగా వచ్చిన మార్క్ ఆంధోనీ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్ర పోషించారు.
నిర్మాతల్ని ఇలా రాచి రంపాన పెట్టడం ప్రకాష్ రాజ్ స్టైల్. ఆయన వల్ల నష్టపోని నిర్మాత ఉండరంటే అతిశయోక్తి కాదని చాలా మంది చెప్పుకుంటారు. చాలా సార్లు ఆయనపై బ్యాన్ వేశారు. కొన్ని సార్లు ఆయనతో డబ్బింగ్ కూడా చెప్పించుకోరు నిర్మాతలు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని పెట్టుకుని ప్రకాష్ రాజ్… మిగతా అందర్నీ విమర్శించేందుకు రెడీ అవుతారు. సమయం, సందర్భం లేకుండా ఇతరుల ప్రస్తావనను తీసుకు వస్తూంటారు. ముందు ఆయన తన వ్యక్తిత్వాన్ని అందుకే సంస్కరించుకోవాలని ఎక్కువ మంది నెటిజన్లు సలహాలిస్తున్నారు.