ఒకడేమో .. ఏదో లడ్డూ చూపించి అందులో పాన్ పరాగ్ ప్యాకెట్ వచ్చిదంంటాడు. ఇంకొకడేమో అన్నంలో జెర్రి వచ్చిదంంటాడు. వీళ్లంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అంటే టీటీడీపై బురద చల్లేస్తారు. అందులో నిజం ఎంత ఉందన్నది మాత్రం పట్టించుకోరు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ప్రతి ఒక్క విభాగం అత్యాధునిక సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఎలాంటి చిన్న తప్పు జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇక అన్నంలో జెర్రి వచ్చిందని ఫోటో ప్రచారం చేస్తున్నారు.. అంతగా స్టీమ్ చేసిన అన్నంలో అ జెర్రి ఎలా ఉంటుందని .. టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
కాస్త నిశితంగా పరిశీలిస్తే అవన్నీ ఫేక్ వార్తలనీ ఈజీగా తెలిసిపోతుంది. అయినా తిరుమలపై ఉన్న కోపంతోనే .. ప్రభుత్వంపై ఉన్న కోపంతోనే ముందూ వెనుకా ఆలోచింకుండా ప్రచారం చేసేస్తున్నారు కొంత మంది. దీని వల్ల తమకు తెలిసి కూడా తప్పు చేస్తున్నామని తెలివి ఉన్నా తమ టార్గెట్ కోసం వారు ఆ పని చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ.. ఏద ఓ అపచారం జరిగిందని ప్రచారానికి వెనుకాడటం లేదు.
దేవుడు శిక్షించకపోవచ్చు కానీ.. దేవుడిపై ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం మంచిదేనా కాదా ఆ భక్తులే ఆలోచించుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల టీటీడీపై.. ప్రభుత్వంపై మరక వేయాలని ఆశ పడుతున్నారు కానీ.. తాము చేస్తున్న తప్పేమిటో తెలుసుకోలేకపోతున్నారని అటున్నారు.