ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ కు రూల్స్ ప్రకారం ఏపీ నుంచి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వడం కూడా తప్పే అన్నట్లుగా ఓ పత్రికలో వచ్చిన వార్త అధికారులు అందర్నీ విస్మయానికి గురి చేసింది. గుడ్డిగా రూల్స్ ఫాలో అయిపోతూ ఇచ్చేశారని అందులో పేర్కొన్నారు. రూల్స్ అంటే రూల్స్ ఫాలో కావాల్సిందే. గుడ్డిగా..కళ్లు తెరుచుకునా అన్నది మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ రూల్స్ ఉల్లంఘించి అయినా సోమేష్ కుమార్ కు ఇవ్వాల్సినవి ఆపేయాలన్నట్లుగా ఆ కథనం ఉంది.
సోమేష్ కుమార్ ఏపీకి కేటాయించినా తెలంగాణలో పని చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీకి వచ్చారు కానీ పని చేయడం ఇష్టం లేక వీఆర్ఎస్ తీసుకున్నారు. దానికి అప్పటి సీఎం జగన్ ఓకే ఛేశారు. జాయినయ్యారు. రిటైర్ అయ్యారు. ఇక ప్రయోజనాలు ఇవ్వాల్సింది ఏపీనే. నిజానికి ఆయన పదేళ్లు తెలంగాణలో పని చేసి ఉండవచ్చు కానీ ఆయన రిటైర్మెంట్ ప్రయోజనాలు సర్వీస్ మొత్తానికి సంబంధించినవి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. కోర్టు తీర్పు ప్రకారం… తెలంగాలో రిటైరవ్వాల్సిన ఆయన ఏపీలో రిటైరయ్యారు.
సోమేష్ కుమార్ తన పదవిని దుర్వినియోగం చేశారన్న విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ లేవు. ఆయనపై జీఎస్టీ కేసు కూడా నమోదయింది. అలాంటి విషయాల్లో ఆయనను తప్పు పట్టవచ్చు కానీ.. ఏపీ ప్రభుత్వం ఆయనకేదో పేవర్ చేసిందన్నట్లుగా అధికారులు ఆయనకు సానుభూతి చూపిస్తున్నట్లుగా ప్రచారం చేయడం మాత్రం భిన్నమే. సోమేష్ విషయంలో రూల్స్ ఉల్లంఘిస్తే ప్రశ్నించాలి కానీ రూల్స్ పాటిస్తే ప్రశ్నించడం కరెక్ట్ కాదేమో !?