వాలంటీర్లు అంటే జగన్ రెడ్డికి ఎంతో ఇష్టం. వారిని నాయకుల్ని చేయాలనుకున్నారు. కానీ ఓడిపోయారు. ఇప్పుడు వాలంటీర్లు గాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడంలేదు. దీంతో వారందర్నీ పార్టీ తరపున పనులు చేయించుకుని జీతాలు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ మాటలు నమ్మి లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి పని చేశారు. ఇంకా లక్షన్నర మంది వరకూ రాజీనామాలు చేయలేదు. వారికి ప్రభుత్వం ఏ విషయం చెప్పడం లేదు. ఎలా వాడుకోవాలో అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారు.
అయితే వాలంటీర్ల వ్యవస్థను గొప్పగా చెబుతున్న తాము తీసుకు వచ్చిన వ్యవస్థను కాపాడుకోవడానికి వారిని పార్టీ తరపున పని చేయించుకోవాలని భావిస్తున్నారు. అందుకే నెలకు ఐదు వేలు చొప్పున పార్టీ తరపున రెండున్నర లక్షల మందికి ఇచ్చి ఆ వ్యవస్థను కాపాడాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే జగన్ రెడ్డి మనస్థత్వం తెలిసిన ఎవరూ దీన్ని నమ్మడం లేదు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని సాక్షి పత్రికకు పెద్ద ఎత్తున నగదు దోచి పెట్టిన బుద్ది ఆయనదని.. ఆయన వాలంటీర్లకు జీతాలిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా క్యాడర్ కు ఆయన చేసిన సాయమే లేదని చెబుతున్నారు.
ఇప్పుడు వాలంటీర్లకు జీతాలివ్వాలంటే.. ఐదేళ్లలో వందల కోట్లు ఖర్చవుతుంది. ్ప్పటి వరకూ ఆయన ఆ భారం మోస్తే మాత్రం క్యాడర్ కు ఇవ్వకపోయినా.. కనీసం తాము జీవితాల్ని నాశనం చేసిన వారికి భరోసా అయినా ఇచ్చినట్లే అవుతుందని అంటున్నారు. ఆ వాలంటీర్ల వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని వైసీపీ క్యాడర్ అంటున్నా.. జగన్ మాత్రం..క్యాడర్ కన్నా వాలంటీర్లనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. మరి వారినైనా లీకులు ఇస్తున్నట్లుగా ఆదుకుంటారా ?