కొండా సురేఖపై నాగార్జున కుటుంబం మూకుమ్మడి దాడి చేయాలని నిర్ణయించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొండా సురేఖకు పూర్తి స్థాయిలో సపోర్టు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆమెకు అండగా ఉన్నారు. బయట జరుగుతున్న ప్రచారాలను పట్టించుకోవద్దని మంత్రిగా విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ఆమెకు చేతల ద్వారానే సంకేతాలు పంపారు.
కొండా సురేఖ చుట్టూ ఓ మైండ్ గేమ్ ను బీఆర్ఎస్ నడుపుతోంది. కొండా సురేఖతో రాజీనామా చేయించేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నుంచి రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇవ్వలేదన్న వరకూ రెండు వైపులా వారే ప్రచారం చేస్తున్నారు. మరో వైపు సినీ ఇండస్ట్రీలోని తమ వారితో ఖండన ప్రకటనలు చేయిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా వార్నింగ్ ఇస్తే తప్ప ఆపలేదు. ఆ తర్వాత కూడా అంతర్గతంగా కొనసాగిస్తున్నారు.
కొండాసురేఖ అంశం పూర్తిగా రాజకీయ పరమైనది. నాగార్జునకు నేరుగా రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు కానీ.. రాజకీయసంబంధాలతో లబ్ది పొందారు. అందుకే కొండా సురేఖ టార్గెట్ చేశారు. ఈ కామెంట్స్ కూడా రాజకీయమే అయ్యాయి. సమంత విషయంలో క్షమాపణ చెప్పడం… కామెంట్స్ వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణగాల్సింది. ముఖ్యమంత్రిగా.. తన మంత్రిని తప్పు పడితే తనను తప్పు పట్టినట్లేనని రేవంత్ భావించారు. కొండాసురేఖకు ఫుల్ సపోర్టు ఇస్తున్నారు.