హైదరాబాద్‌లో స్థలంపై పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ ఉంటాయని అందరూ నమ్ముతారు. హైదరాబాద్ అంటే ఏది ?. దీనికి సరిహద్దుల్ని సాంకేతికంగా నిర్ణయించవచ్చు కానీ పెట్టుబడి పరంగా నిర్ణయించలేరు. అందుకే సిటీకి కాస్త దూరంగా ఉండే షాద్ నగర్ వంటివి కూడా హైదరాబాద్‌లో కలిపేసే అమ్మేస్తూంటారు రియల్టర్లు. అలాంటి మరో ప్రాంతం అమనగల్.
ఆమన్ గల్ ఓఆర్ఆర్ వద్ద రింగ్ రోడ్డు దిగగానే తుక్కుగూడ నుంచి అరగంటలో ఆమన్‌గల్‌కు చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంటుందీ ప్రాంతం. ఓఆర్ఆర్ వద్ద తుక్కుగూడ ఎలా అభివృద్ధి చెందిందో రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా ఆమన్‌గల్ కూడా అలాగే అభివృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ప్రస్తుతం ఇక్కడ ప్లాట్ల రేట్లు తక్కువ ఉన్నాయి.
మహేశ్వరం, తుక్కుగూడ కడ్తాల్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు కొనలేనివారంతా ఆమన్ గల్ వైపు చూస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో ఇళ్ల నిర్మాణం గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తులో పెట్టుబడి కోసం అనువైన ప్రాంతమన్న అభిప్రాయంతో అధిక శాతం మంది ఇందులో ప్లాట్లను కొనడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ ఆమనగల్ కు సుమారు 4-5 కిలోమీటర్లలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు అమన్ గల్ వైపు ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నరు.
తుక్కుగూడ నుంచి హాజీపూర్ దాకా గల రెండు వరుసల రహదారిని ఫోర్ లేన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. అరగంటలోపే తక్కుగూడ నుంచి ఆమన్‌గల్‌కు చేరుకోవచ్చు.2018 కంటే ముందు ఆమన్ గల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎకరం ధర రూ.10 లక్షలుండేది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కోట్లలోకి వచ్చాయి. స్థలాలు గజాల లెక్కన్ ప్లాట్లువేసి అమ్మేవే ఎక్కువ. ల ఆమన్ గల్ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా గజం ధర రూ.50 వేలు పలుకుతోంది. కాస్త లోపలికి వెళితే తగ్గొచ్చు. గేటెడ్ కమ్యూనిటీలూ పెరుగుతున్నాయి.