వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. అధికారులు రూల్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే అలవాటు కొనసాగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ సంయుక్త కార్యదర్శిగా ఉన్న విజయరాజుపై వేటు పడటం ఖాయమయింది. అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా పని చేసిన ధియోఫిలిస్ అనే అధికారి విషయంలో తప్పుడు నివేదికలు..తన పై అధికారి పేరుతో ఇచ్చేశారు. దొరికిపోవడంతో కఠిన చర్యలకు రంగం సిద్ధమయింది.
ఒక్క విజయరాజు రాజు కాదు వైసీపీ హయాంలో ముందూ వెనుకా చూసుకోకుండా… వైసీపీ నేతలు అడిగినట్లుగా నివేదికలు ఇచ్చేసిన అధికారులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇప్పుడు వారంతా మారడం లేదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. వారు చెప్పారని.. వీరు చెప్పారని ఇష్టం వచ్చినట్లుగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గడ్డుపరిస్థితి ఎదురవుతోంది. ఇప్పుడు పై స్థాయి అధికారుల కాళ్లూ, గడ్డాలు పట్టుకుని కాపాడాలని వేడుకుంటున్న వారికీ సరైన ఫలితం ఉండటం లేదు.
రూల్స్ పాటించకుండా తప్పుడు పనులు చేసిన వారికి ఇవాళ కాకపోతే రేపైనా గట్టి షాక్ తగలక తప్పదు. కానీ ఇప్పటికీ వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా చేస్తున్న వారికి కోలుకోలేని షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని టీడీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు.అడ్డంగా దొరికిపోయిన వారిని ప్రభుత్వం ఏ మాత్రం సహించే పరిస్థితుల్లో లేదు.