ఐదేళ్లలో ఏం జరిగింది… ఎక్కడ తప్పు జరిగింది వంటివాటిని విశ్లేషించుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని ఆయన నియోజకవర్గాల నేతలతో పెడుతున్న సమావేశాల్లో స్పష్టత వస్తోంది. ఓ నియోజకవర్గం నుంచి నేతల్ని పిలుచుకువస్తారు. పార్టీ ఆఫీసుగా మారిన క్యాంప్ ఆఫీసులో కూర్చోబెడతారు. కాసేపటికి జగన్ తీరికగా వచ్చింది…. మనం గొప్ప పనులు చేశాం అయినా ఓడిపోయాం… చంద్రబాబు అబద్దాలు చెప్పారు అని కాసేపు ఏడ్చేసి వెళ్లిపోతారు. ఎవరు వచ్చినా సేమ్ స్క్రిప్ట్.
ఓటమి తర్వాత ఎవరైనా రివ్యూ చేసుకుంటారు . కానీ జగన్ మాత్రం భిన్నం. తాను అద్భుతంగా ఆడానని కానీ ఎదుటివాళ్లు తొండిగా ఆడి గెలిచారని నిర్ణయించేసుకుంటారు. మళ్లీ ఆట వచ్చే వరకూ అదే నస అందరికీ చెబుతూంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఓటమి తర్వాత పార్టీ నేతలను పిలిచి అసలేం జరిగిందని అడిగే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది ఆయన లక్షణం కాదు. కనీసం కార్యకర్తల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడైనా ఆ ప్రయత్నం చేస్తున్నారా అంటే… పిలిపించుకుని ప్రసంగాలు ఇచ్చి పంపేస్తున్నారు.
జగన్ రెడ్డి మీడియాలో, సోషల్ మీడియాలో తన స్పీచ్‌లు వస్తే చాలని అనుకుంటున్నారు. తన మాటలు ఎదురుగా ఉన్న వారు వినకపోయినా…. టీవీల్లో వస్తే చాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన రాజకీయంలో అసలైన పార్ట్ ను వదిలేస్తున్నారు. ఇప్పటికైనా కనీసం నియోజకవర్గాల రివ్యూలు పెట్టినప్పుడు కార్యకర్తల గోడు వింటే…. తప్పులు దిద్దుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ తాను అనుకున్నదే నిజం అనుకునే జగన్ కార్యకర్తలంటే ఏదో ప్రయోజనం ఉండేతన వెంట ఉంటున్నారని గట్టిగా అనుకుంటారు. అలాంటి ప్రయోజనం ఉంటే ఉంటారు లేకపోతే లేదని లైట్ తీసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.