గతంలో రైలు ప్రమాదాలు జరిగాయంటే అప్పట్లో సిగ్నలింగ్ వ్యవస్థ మాన్యువల్ గా ఉండేదని కారణంగా చెప్పేవారు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకున్న తరవాత కూడా ప్రమాదాలు జరగడం అసాధరారణం. నిజానికి గత ఆరేడేళ్లతోతో పోలిస్తే గత ఏడాదిలో జరిగిన రైలు ప్రమాదాలు చాలా ఎక్కువ. అత్యంత తీవ్రమైన రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాను రాను రైల్వే ప్రమాదాలను తగ్గించాల్సింది పోయి ఇలా పెరగడం మాత్రం ఖచ్చితంగా వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్లే. తాజాగా తమిళనాడులో జరిగిన ప్రమాదం మరిన్ని ప్రమాదక సంకేతాలను పంపుతోంది.
ఈ ఒక్క ఏడాదిలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. మార్చి లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ీట్టింది, ఇందులో చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. జూన్ లో పంజాబ్‌లోని లూథియానా-అంబాలా ప్రధాన లైన్లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి, అేదే నెలలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది, 15 మంది మరణించగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. జులై లో ఉత్తరప్రదేశ్‌లోని గోండా-మాన్కాపూర్ ప్రాంతంలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలు కనీసం నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. అదే నెలలో జార్ఖండ్‌లోని ముంబై-హౌరా మెయిల్ పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.,
గత ఏడాది ఇంకా ఘోరమైన ప్రమాదాలు జరిగాయి. రైల్వే మంత్రి రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ ప్రభుత్వం మళ్లీ గెలిచిన తర్వాత మళ్లీ అశ్వనీ వైష్ణవే రైల్వే మంత్రి అయ్యారు. కానీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో ఓ స్పష్టమైన లోపం ఉందని వరుసగా జరుగుతున్న ప్రమాదాలు నిరూపిస్తున్నాయి. అసలు లోపం ఎక్కడుందో తెలుసుకుని చర్యలు చేపట్టే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు పెద్దగా కనిపించడం లేదు.