హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం రాజకీయం జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ ఎకగ్రీవాలు, బెదిరింపులతో 38 మంది కౌన్సిలర్లకు గానూ వైసీపీ 30 సీట్లు గెలుచుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులనే గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజతో పాటు 11 మంది కౌన్సిలర్లుతో టీడీపీలో చేరారు. ఆమె పదవికి రాజీనామా చేశారు. దాంతో ఎన్నిక అనివార్యమమయింది.
ఆల్రెడీ టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా వైసీపీ నుంచి 11 మంది వచ్చి చేరడంతో టీడీపీ బలం 17 అయింది. హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి టీడీపీకే చైర్ పర్సన్ పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ ఇంద్రజతో పాటు వచ్చిన నలుగురు కౌన్సిలర్లను వైసీపీ వెనక్కి రప్పించుకుంది. వారిని జగన్ వద్దకు కూడా తీసుకెళ్లారు నేతలు. అయితే వైసీపీకి మరో సమస్య వచ్చింది. కొత్త చైర్ పర్సన్ గా ఎంపిక చేసిన కౌన్సెలర్ గా వైసీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
నందమూరి బాలకృష్ణ ఈ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ ఫాలో చేస్తున్నారు. నలుగురు కౌన్సిలర్లు వెనక్కి పోవడంతో పాటు వైసీపీలో ఉన్న అసంతృప్తిని గమనించి మున్సిపాల్టీ చైర్ పర్సన్ గా మళ్లీ ఇంద్రజనే గెలిచేలా సూచనలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీకి ఒకటికి పది వర్గాలుంటాయి. అందుకే వైసీపీ రిస్క్ చేస్తోందని … వదిలేస్తే సరిపోతందని పెద్దిరెడ్డి లాంటి మాజీ ఇంచార్జ్ నేతలు చెప్పినా జగన్ మాత్రం పోటీ చేయాల్సిందేనని అంటున్నారట.