‘ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్ కి సినిమా రిజల్ట్ కి సంబంధం ఉండదు. సలార్, గుంటూరు, కారం, కల్కి, దేవర ఈ నాలుగు సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ నాలుగు సినిమాలకి ప్రీమియర్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఏది రెవెన్యూ చేయకుండా ఆగలేదు’ అన్నారు నిర్మాత నాగవంశీ. తెలుగు360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.
-‘దేవర’ ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కి నచ్చింది. కేవలం ఫ్యాన్సీ చూస్తే ఈ స్థాయిలో కలెక్షన్స్ రావు. దసరా రోజు (16వ రోజు) కూడా కలెక్షన్స్ అంత బాగున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. జనరల్ ఆడియన్స్ కి నచ్చకుండా ఎంత మంచి రన్ రాదు.
-‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టి మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడం మేము చేసిన మిస్టేక్ అని అనుకుంటున్నాం. ఆ సినిమాని క్లాస్ గానే ప్రమోట్ చేయాల్సిందే.
-ప్రస్తుతం నిర్మాతలకి ఫెయిల్యూర్ ని తీసుకునే శక్తి లేదు. ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఏదో తప్పు చేసినట్లు జనాలు చూస్తారు. లేనిపోని సలహాలు ఇస్తారు. అందుకే మ్యాగ్జిమం తప్పు జరగకుండా ఉండడానికి ట్రై చేస్తాం.
-అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారి కథ జరుగుతుంది. ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ క్యాటర్ చేసే పెద్ద స్కేల్లో స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఇది రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమా కాదు. బిగ్గెస్ట్ స్పెస్ లో వెళ్తున్నాం.
-బాలకృష్ణ గారితో వర్క్ చేయడం వెరీ సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన నిర్మాతలతో చాలా నార్మల్ గా రియాక్ట్ అవుతారు. చిన్న చిన్న విషయాలు కూడా ఆయనతో వెళ్లి మాట్లాడవచ్చు. ఆయన గురించి బయట విన్నవి అన్ని రూమర్సే .
పూర్తి ఇంటర్వ్యూ :