యంత్రాన్ని మనిషి నియంత్రించినంత కాలం సమస్య ఉండదు.. కానీ యంత్రాలే మనుషుల్ని నియంత్రించే పరిస్థితి వస్తే ప్రపంచం రిస్క్ లో పడుతుంది. మానవాళి ఉనికి ముప్పును ఎదుర్కొంటోంది, ఎలాన్ మస్క్ చేస్తున్న వ్యాపారాలతో ఇదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వి, రోబోట్ పేరుతో ఎలాన్ మస్క్ రెండు వాహనాలతో పాటు రోబోట్లను ఆవిష్కరించారు. కార్ల సంగతి పక్కన పెడితే రోబోట్లు అన్ని పనులు చేయబోతున్నాయి. ఎంతగా అంటే చివరికి శృంగారం కూడా రోబోట్లతో చేస్తారట. దానికి తగ్గట్లుగా పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఇది వైపరీత్యం కాదా ?
మానవ జీవితాన్ని డామినేట్ చేస్తున్న యంత్రాలు
ఇప్పటికే మానన జీవితాన్ని యంత్రాలు డామినేట్ చేస్తున్నాయి. ఫోన్ లేకపోతే కాళ్లూ చేతులూ ఆడని పరిస్థితి కనిపిస్తోది. ఇక రోబోలు సాధారణ జీవితాన్ని టేకోవర్ చేస్తే ఇక అరాచకం మొదలవుతుంది. ఇప్పటికే రోబోల వల్ల మానవ వనరుల వినియోగం తగ్గిపోతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఈ రోబోలు ఇక మానవులు చేసే అన్ని పనులు చేయగలుగుతాయి. ఇక మనుషుల అవసరం ఏముంటుందన్న పరిస్థితి వస్తుంది. ఒక్క సారిగా అంతా రోబోలే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే… ఒళ్లు గగుర్పొస్తుంది.
శారీరక అవసరాలూ రోబోలతో తీర్చుకుంటారట !
యంత్రాలు పెరిగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో స్త్రీ, పురుషులు శారీరక అవసరాలను కూడా రోబోలతో తీర్చుకునేందుకే ఆసక్తి చూపిస్తారని సైన్స్, మానసిక పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. పురుషులు, మహిళలు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి పురుషులను కాకుండా రోబోలనే ఎక్కువగా ఇష్టపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఫ్యూచరాలజిస్టులు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఆ ట్రెండ్ ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. 2050 నాటికి సాధారణ శృంగారం కంటే రోబోట్ రొమాన్స్ సర్వసాధారణం అవుతుందని, ఇది మానవుల ప్రేమను పూర్తిగా మరుగుపరుస్తుందని నిపుణులు అంచనా వేశారు.
ఇది మానవడు చేసుకుంటున్న స్వయం వినాశకం
యంత్రాలను ఉపయోగించుకో… మనుషుల్ని ప్రేమించు అనే కొటేషన్ చాలా కాలంగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది , కానీ మనుషుల్ని వాడుకుంటున్నారు…యంత్రాలను ప్రేమిస్తున్నారు. తెలుసుకోవడం లేదు. ఇది రాను రాను పిచ్చిగా మారుతోంది. రోబోలతో అది మరింత ముదరబోతోంది. ఎలాన్ మస్క్ లాంటి అతి తెలివి వ్యాపారవేత్తలు.. మొత్తం మానవాళికే ముప్పు తెచ్చేలా చేస్తున్నారు. వారిని ఎవరూ ఆపలేరు…కానీ జరిగే నష్టాన్ని మాత్రం మానవుడే తగ్గించుకునే ప్రయత్నం చేయలి. లేకపోతే వినాశనం అయ్యేది మానవుడే.