కేటాయించిన క్యాడర్‌కు వెళ్లి పని చేసకోవాలని డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఎలాగైనా ఆపించుకుని తాము పని చేస్తున్న రాష్ట్రాల్లోనే ఉండాలనుకుంటున్న అధికారులకు ఒకే ఒక్క ఆప్షన్ మిగిలింది. అది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకోవడం. డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేసి .. కనీసం స్వాపింగ్ కు అయినా అవకాశం ఇవ్వాలని ఐదుగురు ఐఏఎస్‌లు పెట్టుకున్న పిటిషన్లను క్యాట్ తోసిపుచ్చింది. దీంతో ఐఏఎస్‌లకు మరో మార్గం లేకుండా పోయింది.
తెలంగాణ నుంచి ఐదుగురు.. ఏపీ నుంచి ఐదుగురు ఐఎఎస్‌లు క్యాడర్ మారాల్సి ఉంది. క్యాడర్ స్వాపింగ్ చేసుకుంటామని క్యాట్ ను కోరారు. కానీ వారి సర్వీస్ జాయినింగ్స్ ఇయర్ వేర్వేరు కావడంతో క్యాట్ సంతృప్తి చెందలేదు. సుదీర్ఘ వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాల ప్రకారం కేటాయించిన క్యాడర్లో చేరిపోవాలని ఆదేశించింది. దీంతో ఐఏఎస్‌లు చివరి ప్రయత్నంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
డీవోపీటీ ఆ దేశాల ప్రకారం బుధవారమే వారు రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆ రోజునే లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు. కోర్టు కనీసం మధ్యంతర ఊరట కల్పించినా ఇప్పుడున్న పొజిషన్లలో కొనసాగవచ్చు. లేదంటే ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలి . లేకపోతే సర్వీసులో రిమార్కులు పడిపోతాయి. అందుకే ఆయా అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి కోర్టు తీర్పు కోసం ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి, ఐఎఎస్‌లు రోనాల్డ్ రాస్ , ప్రశాంతి , వాకాటి కరుణ , వాణి ప్రసాద్, అమ్రపాలి విభజనలో భాగంగా ఏపీకి కేటాయించినా తెలంగాణలోనే పని చేస్తున్నారు. ఏపీ నుంచి ఐఎఎస్‌లు ఎస్ ఎస్ రావత్, అనంత్రామ్, సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు కేటాయించినా ఏపీలో పని చేస్తున్నారు.