చిరంజీవి 150వ సినిమా మొదలైపోయింది. గురువారం నుంచి చిరు సెట్లో హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. ఆరు నెలల నుంచి షూటింగ్ హడావుడికి దూరంగా ఉన్న నాగ్… సుదీర్ఘ విరామం తరవాత మేకప్ వేసుకోబోతున్నాడు. నాగ్ – కె.రాఘవేంద్రరావు కలయికలో ఓ చిత్రం మొదలవ్వబోతోంది. శనివారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. గురువారం చిత్రబృందం తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకొంది. అక్కడే ఈ సినిమా విశేషాల్ని తొలిసారి అధికారికంగా ప్రకటించారు. టైటిల్ కూడా కన్ఫామ్ చేసేశారు. ఓం నమో వేంకటేశాయ అనే పేరు ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. నాగ్ హాథీరామ్ బాబాగా కనిపిస్తారని రాఘవేంద్రరావు ప్రకటించారు.
అనుష్క, ప్రగ్యాజైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఓ పాత్రలో విమలారామన్ కనిపిస్తోందని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు పాటల్ని కూడా రికార్డ్ చేసేశారని చిత్రబృందం తెలిపింది. ఈ యేడాది చివరిలోగా ఈ చిత్రాన్ని సిద్దం చేయనున్నారు. నాగ్‌కి డిసెంబర్ నెల బాగా సెంటిమెంట్ . ఆ నెలలోనే శ్రీ నమో వేంకటేశాయ విడుదలయ్యే అవకాశాలున్నాయి.