మంత్రిగా చేసిన విడదల రజనీ చిలుకలూరిపేటలో ఘోరమైన దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమెను అక్కడి నుంచి గుంటూరుకు మార్చారు. గుంటూరులో యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే చిలుకలూరిపేటలో ఆమె చేసిన దందాలు . దోపిడీలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నీ కోట్లలోనే ఉన్నాయి. అయితే తాజాగా నారా లోకేష్‌కు ఓ ప్రిన్సిపల్ చేసిన ఫిర్యాదు చూస్తే.. ఎవరైనా ఇంత కక్కుర్తా అని ఆశ్చర్యపోక తప్పదు.
గత ప్రభుత్వం నాడు-నేడు పేరుతో కొన్ని స్కూళ్లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనుకుంది. ఇలా చిలుకలూరిపేటలోని శారదా ప్రభుత్వ హైస్కూల్‌కు నిధులు కేటాయించారు. నిధుల్లో నుంచి రూ.నలబై లక్షలు మంత్రి విడదల రజనీ కాజేశారు. కానీ పనులు మాత్రం చేయించలేదు. ఇప్పుడు ఆ నిధులకు లెక్కలు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఆమె తనను ఎవరు కాపాడుతారు అని భయపడి నేరుగా వెళ్లి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసింది.
స్కూల్ లో నాడు – నేడు పనులకు కేటాయించిన నిధులను ఆమె నలభై లక్షలు ఎలా డ్రా చేసుకున్నరో వివరించారు. పనులు జరగలేదని.. దానికి కారణం డబ్బులు విడదల రజనీ తీసుకోవడమేనని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే , మంత్రిగా ఉండి ఓ స్కూల్ నాడు, నేడు నిధులు కొట్టేయడం ఏమిటని..చాలా చీప్ అన్న అభిప్రాయం ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత ఎక్కువ మందిలో వినిపిస్తోంది.