గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ రౌడీషీటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గంటలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను హతమారుస్తానని ప్రకటనలు చేశాడు. ఇది ఒక్కటే కాదు పవన్ కుటుంబంపైన.. చంద్రబాబు కుటుంబంపైన ఆయన చేసిన వ్యాఖ్యలు మనుషులు చేసేవి కావు. జగన్ రెడ్డికి ఏది మానసిక ఆనందాన్ని ఇస్తుందో అవే మాట్లాడి ఆయన గుడ్ లుక్స్‌లో ఉండేందుకు ప్రయత్నించేవారు.
అందుకే బోరుగడ్డ అనిల్ ఐదేళ్ల పాటు అనేక దందాలు చేసినా పోలీసులు ఆయన వైపు చూడలేదు. ఎంతో మందిని బెదిరించారు. డబ్బులు వసూలు చేశారు. వైసీపీ అధినేతకు బంధువునని చెప్పుకుని కబ్జాలు చేశారు. గతంలో కర్లపూడి ప్రకాష్ అనే వ్యక్తిని డబ్బులు కోసం బెదిరించడంతో కేసు పెట్టారు. కానీ పోలీసులు దాన్ని అలాగే ఉంచారు. కూటమి ప్రభుత్వం గెలుస్తుందని తెలిసిన తర్వాత ఆయన పరారయ్యాడు. ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాడు.
నాలుగు నెలలు అయింది మర్చిపోతారని అనుకున్నారు. సైలెంట్ గా గుంటూరులోని ఇంటికి వచ్చి ఓ గదిలో ఉంటూ దందాలు చేయాలనుకున్నాడు. కానీ పోలీసులకు సమాచారం రావడంతో వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆయనపై తీవ్రమైన కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తున్నాయి. సోషల్ మీడియా కేసులు కాదని ఆయన ముఖ్య నేతల హత్యకు కుట్ర పన్నారన్న అనుమానాలు ఆయన మాటల్ని సహజంగానే అందరికీ వస్తాయి.