వరదల్లో ప్రజల కష్టాల్లో ఉన్నారని వారి మధ్య వర్గ విద్వేషాలు సృష్టించడానికి సాక్షి పత్రిక చేసిన నికృష్ణ ప్రయత్నం వికటించింది. ఆ పత్రికపై కేసు నమోదయింది. ఓ లాయర్ చేసిన ఫిర్యాదు మేరుక న్యాయసలహా తీసుకుని కేసు నమోదు చేశారు. సాక్షి పత్రికలో వచ్చే వాటిలో అసలు నిజాలే ఉండవు. కానీ మీడియా స్వేచ్చ అని అడ్డం పెట్టుకుని బురద చల్లేస్తూ ఉంటారు. తాజాగా విజయవాడ వరదల కోసం చేసిన ఖర్చులో రూ. 534 కోట్లు కొట్టేశారని పత్రికా కథనం రాశారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది.
ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఖర్చు పెట్టినదెంతో వివరించారు. అయినా తప్పు దిద్దుకోలేదు. దీంతో కావాలని ఆ వార్త రాశారని ప్రజల్లో విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నించారని స్పష్టమయింది. పోలీసులు న్యాయసలహా తీసుకుని కేసు పెట్టారు. ఈ కేసులో సాక్షి ఎడిటర్ మురళిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అసలు కుట్రను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిచనున్నారు. నిజానికి ఈ కేసులో సాక్షి యజమాని అయిన భారతీరెడ్డిని ప్రశ్నించాల్సింది. కానీ ఇటీవల అధికారికంగా ఆమెకు సాక్షిలో ఎలాంటి పదవి లేదని.. స్వయంగా ప్రకటించుకున్నారు. పత్రికలో వచ్చే వార్తలన్నింటికీ ఎడిటర్ వర్ధెల్లి మురళి కారణం అని డిస్ క్లెయిమర్ కూడా ఇచ్చుకున్నారు.
కేసు నమోదు చేసిన తర్వాత సలహాదారుగా ఏ పనీ చేయకుండా జగన్ హయాంలో ఏపీ ప్రజల సొమ్ము తిన్న దేవులపల్లి అమర్ స్పందించారు. తప్పుడు వార్త రాస్తే వివరణ ఇవ్వాలి.. ఆ వివరణ కూడా ప్రచురించకపోతే కోర్టుకెళ్లాలి కానీ ఎఫ్ఐఆర్ పెట్టకూడదని చెప్పుకొచ్చారు. ఇదే దేవులపల్లి అమర్ …జగన్ రెడ్డి మీడియాపై కేసులు పెట్టేందుకు తెచ్చిన జీవోను అడ్డగోలుగా సమర్థించారు. డబ్బులిస్తే చాలు దేనికైనా సిద్దపడే ఇలాంటి జర్నలిస్టులు.. జర్నలిస్టు నాయకులుగా ఉండబట్టే…. అందరూ అంతే అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.