ఇంటూరి రవికిరణ్ అనే ఘోరమైన రాతల వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు వియ్ స్టాండ్ పోస్టర్లు వేశారు వైసీపీ కార్యకర్తలు. వర్రా రవీంద్రారెడ్డి అనే సీరియల్ అబ్యూజర్ను అరెస్టు చేయక ముందే అరెస్టు చేస్తారని తెలిసి వైసీపీ సోషల్ మీడియా మొత్తం స్టాండప్ పోస్టర్లు రెడీ చేసుకుంది. కానీ బోరుగడ్డ అనిల్ ను పట్టుకుపోయారని తెలిసిన తర్వాత ఒక్క వైసీపీ నేత కూడా స్పందించలేదు. ఆయన కోసం ఓ లాయర్ .. కనీసం పొన్నవోలును అయినా కోర్టు వద్దకు పంపలేదు.
బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియదన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వీరి తీరు చూసి బోరుగడ్డ బ్యాచ్ అంతా.. జగన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కానీ అదంతా ఫేక్ అని కాసేపటికి తేలిపోయింది. జగన్ రెడ్డి అసలు బోరుగడ్డ అనిల్ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. రాజమండ్రి జైలు దగ్గరకు పోయే ప్రయత్నం కూడా చేయరు. ఆయన కాకపోతే కనీసం వైసీపీలో ముఖ్యనేతలైనా ఆయనకు మద్దతుగా ప్రకటనలు చేయాల్సింది. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు.
బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి జగన్ కు మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మహిళల్ని, చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. గంటలో చంపేస్తాననే ప్రకటనలు కూడా చేశాడు. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. తనను అలా మాట్లాడమని ప్రోత్సహించిన వారు పట్టించుకోవడం లేదని కనీసం లాయర్ ను కూడా పెట్టలేదని బోరుగడ్డ అనిల్ బోరుమంటున్నారు. వైసీపీ ఇలా వాడుకుని తీరా రోడ్డున పడేస్తుందని బాధపడుతున్నారు. తాను అప్రూవర్ గా మారుతానని అంటున్నారు.