ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాని తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రెండు కోట్లు చెల్లిస్తే, హైదరాబాద్ పోలీసులు మాత్రం ఆమె ఎంత పెద్ద క్రీడాకారిణి అయినా, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా సరే రూలురూలే అంటూ ఆమె వద్ద నుండి రూ.200 జరిమానా వసూలు చేసారు. సోమవారం రాత్రి జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహనాల తనికీలో భాగంగా ఆమె కారుకి నిబంధనల ప్రకారం ఉండాల్సిన హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేనందుకు ఆమెకి పోలీసులు జరిమానా విధించారు. ఆమె ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఆ మొత్తం చెల్లించారు.