తెలంగాణ గ్రూప్ 1 వాయిదా వేయాలంటూ కొంత మంది విద్యార్థులు చేస్తున్న ఆందోళన పూర్తిగా రాజకీయ కుట్ర అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న అభ్యర్థుల పేరుతో కొంత మంది ఎప్పుడూ లీడర్ల చుట్టూ తిరిగే వారు.. కొన్నిపార్టీల కార్యకర్తలు తప్ప పరీక్షను వాయిదా వేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. రెచ్చగొట్టి లాఠీచార్జ్ కూడా జరిగేలా చేసుకుని ఏదో జరిగిపోతోందన్న ఫీలింగ్ ను రాష్ట్రం మొత్తం తెప్పించడం కోసం భారీ కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
గ్రూప్ వన్ కోసం పదేళ్లుగా నిరీక్షిస్తున్న వారు మెయిన్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. వారి భ విష్యత్ ను కాలదన్నేలా కొంత మంది రాజకీయ ఆకాంక్షలతో పరీక్షల నిర్వహణను రిస్క్ పడేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ నోటిఫికేషన్‌కు ఏదో ఒక వివాదం రేపడం కామన్ అయిపోయింది. జనరల్ కేటగిరి రేంజ్ లో మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సాధిస్తే.. వికలాంగుడ్ని వికలాంగుల కోటాలోనే వేయాలని ఇప్పుడు ఆందోళన చేస్తున్నవారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డిమాండ్ మానవత్వం ఉన్న ఎవరైనా చేస్తారు. అన్నీ బాగున్నా సాధించలేనిది వికలాంగుడు సాధిస్తే.. వికలాంగుడు అవడం వల్లే సాధించారని ముద్ర వేస్తారా ?
ఇలాంటి సిల్లీ కారణాలతో ఉద్యమాలు చేయబట్టే న్యాయస్థానాలు కూడా అంగీకరించలేదు. ఎక్కడికి వెళ్లినా ఈ పిడికెడు మంది గ్రూపు వన్ అభ్యర్థులకు నిరాశ తప్పదు. ఒక వేళ వారి ప్రయత్నం సక్సెస్అయితే లక్షల మంది నిరుద్యోగుల ఆశలు చెదిరిపోతాయి.