సజ్జల రామకృష్ణారెడ్డి తాను తెర వెనుక ఉండి అన్నీ పనులు చేశానని.. అందర్నీ వేధించానని.. తిట్టించానని .. తన మీదకు ఏమీ రాదని తడి గుడ్డేసుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎంత అమాయకుడో పట్టుబడిన ఒక్కొక్కడు బయటపెడుతున్నారు. తాజాగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి తాను చేసిన హెచ్చరికలు, మాట్లాడిన బూతులన్నీ వైసీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అని వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఆఫీసు ఏదంటే సజ్జల ఆఫీస్.
బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఆయన ల్యాప్ ట్యాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక సమాచారం ఉంది. వైసీపీకి మద్దతుగా ఉండే యూట్యూబ్ చానళ్లు ఫలానా రోజు ఇంటర్యూకు వస్తాయి… ఫలానా విధంగా మాట్లాడాలి అని డేట్ ఫిక్స్ చేసిన మెసెజులు బోలెడు కనిపించాయని తెలుస్తోంది. దీనిపై ఆారా తీస్తే తనకు అవన్నీ సజ్జల ఆఫీసు నుంచి వచ్చేవని..తాను అందుకే అలా మాట్లాడానని బోరుగడ్డ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీలో వినిపించిన ప్రతి బూతు మాట వెనుక సజ్జల హస్తం ఉందనేది అందరికీ తెలుసు. తమ నాయకుడి భావప్రాప్తి కోసం ఇతర నేతల్ని .. వారి కుటుంబాల్ని బూతులు తిట్టించడం సజ్జలకు ప్రధానమైన పని. అందు కోసం ఆయన ఓ పెద్ద ప్రయత్నమే చేశారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుందనుకుని.. ఇప్పుడు నిలువునా మునిగిపోతున్నారు. తేలుతారో లేదో మరి !