డబ్బు సంపాదించడమే కాదు ఆ డబ్బుతో సుఖవంతమైన జీవితం వచ్చేలా చూసుకునేలా విలాసవంతమైన ఇళ్లను కొనాలనుకునేవారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది దీనికి సాక్ష్యంగా ఆయా ఇళ్ల అమ్మకాలే నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లయింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల్లో రూ.4 కోట్లకు పైగా ధర కలిగిన ఇళ్లు 12,630ను ధనవంతులు కొనుగోలు చేశారు. . గతేడాది ఇదే కాలంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే.. 38 శాతం ఎక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో 9,165 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని రియల్ ఎస్టేట్ లనివేదికలు వెల్లడిస్తున్నాయి.
హైదరాబాద్లో ఆ ఖరీదైన ఇళ్ల అమ్మకాల వాటా ఎక్కువగా ఉంది. రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఇవి గత ఏడాదితో సమానంగానే ఉన్నాయి పెరగలేదు. జాతీయ స్థాయి పెరుగుదలతో చూస్తే తగ్గినట్లే అనుకోవాలి. ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అక్కడ 70 శాతం పెరిగాయి. అంటే కొన్ని చోట్ల పెరిగాయి..కొన్ని చోట్ల తగ్గాయి. ఓవరాల్ గా చూస్తే పెరుగుతున్నాయి.
సంప్రదాయంగా బడ్జెట్ ఇళ్ల మార్కెట్లుగా భావించే నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. ఆధునిక అపార్ట్ మెంట్లు, పెంట్హౌస్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.