రేవంత్ ను బలహీనం చేసేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారని రేవంత్ సీటుకు ఎసరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ భాయి భాయి అనేదానికి ఇంత కంటే పెద్ద నిదర్శనం ఏముంటుందని కేటీఆర్ పెద్ద విషయం కనిపెట్టినట్లుగా ట్వీట్ పెట్టారు. ఆయనకు పోటీగా ఆయన అనుచరులు కూడా అదే ప్రారంభించారు. నిజానికి ఇదే మాట కేటీఆర్ వారానికో సారి అయినా చెబుతూనే ఉంటారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తము ముప్పు కాబోమని.. ఆయనకు నల్లొండ, ఖమ్మం జిల్లాల నుంచే మంత్రులు ముప్పుగా ఉన్నారని వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పదవి నుంచి తప్పించేయగలరని చెబుతూనే ఉన్నారు. కేటీఆర్ మాటల్లో పొంగులేటి, కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి పై కుట్ర చేస్తున్నరన్న అర్థం ఉంది. ఇప్పుడు బండి సంజయ్ కూడా అదే చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఎందుకు ముందు అంత ఆసక్తి…. ఆ మంత్రులు కూల్చేస్తే మీకేంటి నష్టం అని బీఆర్ఎస్ బీజేపీపై ఎదురుదాడి దిగింది. మరి కేటీఆర్ అలా అన్నప్పుడు ఈ అర్థం రాలేదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది.
బండి సంజయ్ కు రేవంత్ మీద అభిమానం ఉందో లేదో కానీ… తన రాజకీయ భవిష్యత్ పై కుట్ర చేసిన కేసీఆర్, కేటీఆర్లపై ఎవరికీ లేనంత కోపం ఉంది. వారిపై ఎాలాంటి చర్యలు తీసుకున్నా ఆయన స్వాగతిస్తారు. వారితో పోలిస్తే రేవంత్ విషయంలో సాఫ్ట్ గానే వ్యవహరిస్తారు. ఇంత మాత్రం దానికి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. బీఆర్ఎస్ విమర్శలకు బండి సంజయ్ ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్కు మూటలు మోసిందెవరో ఢిల్లీలో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు.