బైజూస్ రవీంద్రన్ దేశంలో కనిపించడం లేదు. ఓ వైపు కంపెనీ దివాలా తీసింది. అప్పులు ఇచ్చిన వాళ్లు అమెరికా నుంచి ఇండియా వరకూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఉద్యోగులకూ బాకీ ఉన్నారు. అన్ని వ్యవహారాలు దగ్గరుండి సెటిల్ చేయాల్సిన రవీంద్రన్ చాలా కాలంగా దేశంలో ఉండటం లేదు. తాజాగా ఆయన వర్చువల్ గా మీడియా ప్రతినిధులకు ఇంటర్యూలు ఇచ్చి తాను పరారు కాలేదని మళ్లీ ఇండియాకు వస్తానని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ తేడాగా ఉండటంతో ఇక ఎవరికీ కనిపించరని అర్థమైపోయింది.
తాను దుబాయ్ లో ఉన్నానని తన తండ్రి అనారోగ్యం కారణంగా చికిత్స చేయించడానికి వచ్చానని చెబుతున్నారు. దుబాయ్ కన్నా ఇండియాలోనే మెరుగైన ఆస్పత్రులు ఉన్నాయి. అంతగా కావాలనుకుంటే అమెరికాకు తీసుకెళ్లవచ్చు కానీ ఆయన దుబాయ్ కే వెళ్లానని చెప్పడం ఏమిటో వ్యాపార వర్గాలకూ అర్థం కాలేదు. బైజూస్ వాల్యూ ఇప్పుడు జీరోకి చేరిపోయిందని.. అప్పుల సెటిల్మెంట్లు తీరిపోయాక కంపెనీని నిలబెట్టేంవైదుకు ఒక్క శాతం చాన్స్ ఉన్నా తిరిగి వస్తానని చెప్పుకొచ్చారు.
భారత్లో అత్యంత విలువైన ఎడ్ టెక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న బైజూస్.. 22 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఓ దశలో పేరు తెచ్చుకుంది. కరోనా కాలంలో ఆ కంపెనీకి ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం జీరో స్థాయికి పడిపోయింది. ప్రమోటర్ బైజూస్ రవీంద్రన్ .. పారిపోయినట్లయింది.