విశాఖలోని ఎండాడ కొండపై శారదాపీఠానికి కేటాయించిన అత్యంత విలువైన పదిహేను ఎకరాల భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గతంలోనే ఈ భూముల కేటాయింపును రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ నాలుగు నెలలు ఆలస్యం అయింది. పైగా ఓ మంత్రి అండతో ఆ ఫైల్‌ను వెనక్కి పంపేశారని తెలియడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో అధికారులు అఘమేఘాలపై చర్యలు తీసుకున్నారు. భూముల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
జగన్ మోహన్ రెడ్డికి రాజగురువగా వ్యవహరించిన స్వరూపానంద ఆయన పెద్ద ఎత్తున బూములు కేటాయింప చేసుకున్నారు. అందులో ఎండాడ కొండ కూడా ఒకటి. శారదాపీఠం కాబట్టి అధ్యాత్మిక కార్యక్రమాల కోసం కేటాయిస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వంలో జీవో ఇచ్చారు. అయితే ఆధ్యాత్మికంగా చాలా చోట్ల చేస్తున్నాం కానీ ఎండాడ కొండపై మాత్రం వ్యాపారం చేస్తాం అనుమతి ఇవ్వాలని అదనంగా మరో దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.
రాజకీయ నేతల్ని గ్రిప్‌లోకి తెచ్చుకోవడంలో సిద్దహస్తుడైన స్వరూపానంద టీడీపీలోని ఓ మంత్రిని కూడా కాకా పట్టినట్లగా తెలుస్తోంది. దీంతో ఆయన అండతో భూములు రద్దు చేయకుండా ఆలస్యం చేసుకున్నారు. చివరికి భూ కేటాయింపు రద్దు అయింది. మరో వైపు తిరుమలలో కాటేజీ నిర్మాణంలో ఆయన చేసిన అవకతవకలపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు.