అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ తో పాటు ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేశాయి. కేంద్రం పది శాతం నిధుల్ని అడ్వాన్స్ గా మంజూరు చేస్తోంది. దీంతో పనులు పరుగులు పెట్టనున్నాయి. సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణంతో ప్రారంభమైన … అమరావతి 2.0ని మరో మూడేళ్లలో తొలి విడత పూర్తి చేయాలనుకుంటున్నారు. గతంలోలా ఇప్పుడు బాలారిష్టాలు లేవు. పునాదులు గతంలోనే పడిపోయాయి. ఆ పునాదుల నుంచి కట్టుకుటూ రావడమే మిగిలింది.
కొత్త సెక్రటేరియట్ భవనాలు, కొత్త హైకోర్టు, కొత్త రాజ్ భవన్ సహా అన్ని నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని డిసైడయ్యారు. నిధుల కొరత అనే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఓ సారి నిర్మాణం ఊపందుకుంటే సీఆర్డీఏకు ఆదాయమే ఆదాయం. చంద్రబాబు ఈ సిటీని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. రైతులు సహకరించారు. ఇప్పుడు ఆటంకాలన్నీ తీరపోయాయి. ఇక ముందడుగు వేయడమే మిగిలింది.
అమరావతికి వస్తున్న నిధుల్లో ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన పని లేదు. ఎందుంటే అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఖాతాల్లోనే రుణాలుగా ఉంటాయి. తిరిగి కట్టాల్సింది కూడా కేంద్రమే. అంటే అమరావతికి మాత్రం గ్రాంట్ అనుకోవచ్చు. ఏ విధంగా చూసినా అమరావతి ఐదేళ్ల ఘోరమైన నిర్బంధాల తర్వాత ఫీనిక్స్ తరహాలో ఎగరడానికి సిద్ధమయింది.