ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ రిటైర్ అవుతున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆయన స్థానంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా రాహుల్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈనాడు డామినేషన్ ఎక్కువగా ఉంది. కీలక స్థానాల్లో ఉన్న వారంతా ఈనాడు నుంచి వచ్చిన వారే. రాహుల్ కుమార్ కూడా ఈనాడు నుంచి వచ్చారు.
కె.శ్రీనివాస్ రోజువారీ ఎడిటర్ వ్యవహారాలను చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. ఆయన రాసే కాలమ్స్, ఎడిట్ పేజీలో వంటి వాటిని మాత్రమే చూసుకునే వారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దర్నీ ఇంచార్జులుగా పెట్టింది. మొత్తం వారే చూసుకుంటున్నారు. సమాజంలో కె.శ్రీనివాస్ కు ఉన్న గుర్తింపు కారణంగా ఆయనను ఇతర ఉద్యోగుల్లా బయటకు పంపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆయన రిటైర్ అవుతున్నారు. నిజానికి ఆయనను కొనసాగించాలని అనుకుంటే..కొనసాగించేవారే. కానీ వద్దనుకున్నారని అనుకోవచ్చు.
గతంలో ఆంధ్రజ్యోతిలోనే పని చేసి నమస్తే తెలంగాణ బాధ్యతలు తీసుకుని తరవాత బీఆర్ఎస్ హయాంలో మీడియా అకాడమీ చైర్మన్ గా చేసిన అల్లం నారాయణతో కలిసి డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టాలని కే శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి పెట్టుబడి సపోర్టు కూడా రావడంతో ఆయన ఆంధ్రజ్యోతి నుంచి రిటైర్మెంట్ పేరుతో బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.