విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములపై ఈడీ దాడులు జరిగాయి. వెంటనే సీఎం రమేష్ తెరపైకి వచ్చి ఎంవీవీపై ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని.. ఇంకా కొనసాగుతాయని ప్రకటించారు. వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తానే ఫిర్యాదు చేశానని త్వరలో మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని ప్రకటించారు.
సీఎం రమేష్ తీరు చూస్తూంటే ఈడీ దాడులు తన కనుసన్నల్లో జరిగాయని ఆయన చెప్పుకోవాలని తాపత్రయ పడినట్లుగా కనిపిస్తోంది. నిజంగానే ఆయనకు అంత పవర్ ఉంటే మాత్రం ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలందరికీ ఇబ్బందికర పరిస్థితులే. ఆయనకు అలాంటి పవర్ లేదని అనుకోవడానికి కూడా లేదు . బీజేపీ హైకమాండ్ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉంది. అంతకు మించి లాబీయింగ్ చేయడంలో సిద్దహస్తుడు.
బొత్స దగ్గర నుంచి అనేక మంది ఆర్థిక వ్యవహారాల్లోకి తొంగి చూస్తే ఈజీగా దొరికిపోయే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అధికారం శాశ్వతం అన్న మైకంలో ఏమేమి చేశారో చెప్పాల్సిన పని లేదు. అంతా బహిరంగ దోపిడీ చేశారు. అందులో వాటా కొంత పైకి పంపించి పని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు వారందరికీ.. సీఎం రమేష్ వార్నింగ్ ఇస్తున్నారు.