రాజకీయం చేయవచ్చు కానీ అతిగా చేస్తే ప్రజలకు కూడా చిరాకు వస్తుంది. ప్రతీ దానికి ప్రభుత్వమే కారణం అని.. చంద్రబాబే కారణం అని నిందిస్తూ పోతే ప్రజలు కూడా “ఇది పిచ్చం”డి అనుకుంటారు తప్ప ఔను నిజమే అనుకునే పరిస్థితి ఉండదు. ఓ సమాజం అన్నాక నేరాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు పని చేయాలి. నేరాలు చేయాలనుకునేవారికి భయపెట్టేలా చట్టాలు అమలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వాలను ప్రశ్నించడం కరెక్ట్ కానీ ప్రతీది మీ వల్లే జరిగిందని నిందించడం వల్ల రాజకీయ వైరాగ్యమే వస్తుంది.
జగన్ హయాంలో నేరగాళ్లకు పెరిగిన భరోసా -ఇప్పటికీ అదే జాడ్యం
ఏపీలో జరుగుతున్న నేరాలపై జగన్ రెడ్డి , వైసీపీ నేతలు చంద్రబాబు మీదనే ఆరోపణలు చేస్తున్నారు. బద్వేలులో జరిగిన ఘటనను చూస్తే.. ఇద్దరూ స్నేహితులే. ఎప్పుడూ ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. మరి అక్కడ అమ్మాయిని రక్షించడం ఎలా సాధ్యం ?. సమాజంలో నేర ప్రవృత్తి ఉన్న వారుు చాలా మంది ఉంటారు. వారందర్నీ కనిపెట్టి ఉండటం పోలీసులకు సాధ్యం కాకపోవచ్చు కానీ… వారిలో ఓ భయాన్ని మాత్రం కల్పించగలగాలి. గత ఐదేళ్ల కాలంలో నేరం చేసిన వారికి శిక్షపడదనే ఓ గ్యారంటీని కల్పించడం వల్ల చాలా మంది అదే ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా నేరాలకు పాల్పడుతున్నారు.
అప్పట్లో పొలిటికల్ పోలీసింగ్ మాత్రమే
జగన్ హయాంలో పొలిటికల్ పోలీసింగ్ మాత్రమే జరిగింది. ఇతర నేరస్తు్ల్ని వదిలేశారు. అదే వైసీపీ వాళ్లయితే.. మర్డర్, రేపులేగా చేసుకుంటే చేసుకున్నారులే అన్నట్లుగా జగన్ ఉండేవారని ఆ పార్టీలో ఉండి వచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా తెలిపారు. అలాంటి నేర, క్రూర మనస్థత్వం ఉన్న జగన్ రెడ్డిల ..ఇప్పుడు దిశ పేరుతో అబద్దాలాడుతున్నారు. అసలు దిశ చట్టమే లేదు.త అయినా దిశ ను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన లాంటి ఓ ఊహా ప్రపంచంలో బతికే నేత వల్లనే ఏపీలో ఈ పరిస్థితులు వచ్చాయి.
నిందితులకు వేగంగా కఠిన శిక్షలు
బద్వేలులో యువకుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మరణశిక్ష పడేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. నేరాలు చేసేవారు సులువుగా తప్పించుకోవచ్చు అన్న భావనకు రావడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి. దాన్ని మార్చాలని చంద్రబాబు డిసైడయ్యారు. నిందితులు, నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే.. వ్యవస్థ గాడిలోకి పడుతుంది.