తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు యథతథంగా జరగనున్నాయి. రేవంత్ రెడ్డిది మొండి పట్టుదల అని కొంత మంది విమర్శిస్తున్నారు. కానీ పది మంది ఆందోళనలు చేస్తున్నారని ఇరవై వేల మంది ఆశలపై నీళ్లు చల్లడం నాయకుల లక్షణం కాదు. ప్రభుత్వం చేయాలనుకున్నది పర్ ఫెక్ట్ గా.. నిజాయితీగా చేసినప్పుడు ఎవరి మోటివేషన్ల ప్రకారం ఎవరు ఆందోళనలు చేసినా తగ్గకూడదనేది మొదటి సూత్రం. అలా తగ్గితే ప్రతి విషయంలోనూ ప్రభుత్వంపై సవారీ చేసేందుకు చాలా మంది రెడీ అయిపోతారు.
గ్రూప్ వన్ పై జరుగుతున్న ఆందోళనలన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అందరికీ తెలుసు. ఆ ఆందోళనల్లో పాల్గొనేవారిలో సగం మంది అభ్యర్థులు కాదు. మిగిలిన వారిలో అసలు ఎగ్జామ్ రాసేవారు ఎంత మంది ఉంటారో తెలియదు. కానీ ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేసేందుకు మాత్రం ముందుకు వస్తారు. గ్రూప్ వన్ అనేది తెలంగాణ నిరుద్యోగులు పదేళ్ల పాటు ఎదుుర చూసిన అవకాశం. మెయిన్స్ కోసం వాయిదాలు మీద వాయిదాలు కోరుకునేవారు ఎవరూ ఉండరు. నిజంగా కష్టపడిన వారు అసలు ఉండవు.
న్యాయస్థానాల్లోనూ అనుకూలమైన తీర్పు రానప్పుడు ఎవరైనా ఏం చేయాలి ?. ఆ పరీక్షలను సమర్థంగా నర్వహించేలా సహకరించాలి. కానీ తెలంగాణలో ప్రతీది రాజకీయమే. దేశ రక్షణ కోసం దామగుండంలో లో ప్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పెడితే దాని వల్ల అనంతగిరి అడవి అంతా నాశనమైపోతుందని ప్రచాంర చేస్తున్నారు. గ్రూప్ వన్ లోనూ అంతే. అసలు నిజాలు కన్నా అవాస్తవాలతో రెచ్చగొట్టే ప్రయత్నమే ఎక్కువ జరుగుతోంది. దీన్ని ప్రభుత్వం పర్ ఫెక్ట్ గా డీల్ చేసిందని అనుకోవచ్చు.