బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళనాట విజయవంతమైన గరుడన్ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ‘గరుడ’ అనే పేరు పెడదామనుకొన్నారు. అయితే అప్పటికే ఆ పేరు రిజిస్టర్ అయి ఉంది. ‘వీర ధీర శూర’ పేరు కూడా పరిశీలించారు. రిజిస్టర్ కూడా చేయించారు. కానీ ఇప్పుడు ‘వామన’ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ పేరు కూడా ఛాంబర్లో నమోదు చేశారు. దీన్నే ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురు మిత్రుల కథ. మంచు మనోజ్.. ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
బెల్లంకొండ చేతి ఇప్పుడు ఫుల్ బిజీ. చేతిలో చాలా సినిమాలున్నాయి. టైసన్ నాయుడు పూర్తి కావొచ్చింది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శ్రీనివాస్. ఆ సినిమా బడ్జెట్ అటూ ఇటుగా రూ.50 కోట్లు. టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. చావు కబురు చల్లగా దర్శకుడు కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘వామన’ ఈ సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే మిగిలిన సినిమాలన్నీ పక్కన పెట్టి దీనిపై ఫోకస్ చేశాడు బెల్లంకొండ. షూటింగ్ కూడా త్వరితగతిన సాగుతోంది.