సమంతతో విడిపోయిన తరవాత నాగచైతన్య కొంతకాలం సింగిల్ గానే ఉన్నాడు. ఆ తరవాత కథానాయిక శోభిత తో ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. వీటిపై అక్కినేని ఫ్యామిలీ గప్ చుప్‌గా ఉంది. కానీ సడన్ గా ఓ రోజు నిశ్చితార్థ వేడుక నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చారు. తమ కుటుంబంలోకి శోభితని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు. అయితే పెళ్లి డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.
ఇప్పుడు చైతూ పెళ్లికి ముహూర్తం ఫిక్సయ్యిందని టాక్. పెళ్లి పనులు కూడా మొదలెట్టేశారని తెలుస్తోంది. దానికి తగ్గట్టే శోభిత ఇన్‌స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. పట్టు చీరతో సంప్రదాయకరంగా కనిపిస్తున్న ఫొటో అది. చేతిలో పసుపు కొమ్ములు, చుట్టూ బంధువులూ ఉన్నారు. ‘గోధుమ రాయి-పసుపు దంచడం.. అండ్ సో బిగెన్స్’ అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. దాన్ని బట్టి… పెళ్లి పనులు మొదలైపోయాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేయడం స్టార్ట్ చేశారు. అయితే అక్కినేని కుటుంబం నుంచి పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్తా బయటకు రాలేదు. చైతూ పీ.ఆర్‌లను సంప్రదిస్తే వాళ్ల దగ్గర కూడా సమాచారం లేదంటున్నారు. ఈ నెలలోనే చై – శోభిత పెళ్లి జరగబోతోందని, అయితే ఈసారి చాలా నిడారంబరంగా చేస్తారని, పెళ్లికి అతి సమీప బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.