ది హోల్ కాలేజీ అని ప్రిన్సిపాల్ అంటే ఈ కాలేజీకి పెద్దబొక్కపడింది అని లెక్కరర్ ట్రాన్స్‌లేట్ చేసే సీన్లు చూసి ఇంత అజ్ఞానమా అని పగలబడి నవ్వుకున్నాం. నిజ జీవితంలోనూ ఇలాంటి కమెడియన్లు కోకొల్లలుగా ఉన్నారు. ఎవరో పిట్టదొరలు అయితే మనకు సమస్య లేదు. మీకు విజ్ఞానం పంచుతామంటూ ఎక్కడ లేని న్యూస్ అంతా తనను నమ్మిన ఫాలోయర్ల బుర్రల్లోకి ఎక్కించే జర్నలిస్టుల్లోనూ ఉండటం అసలు విషాదం.
పేటీయం బిరుదాంకితుడే కాదు నిశానీ కూడా !
జర్నలిస్టు సాయి అనే జర్నలిస్టు గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే టీవీ 9 మొదట్లో ఎంచుకున్న జర్నలిస్టుల్లో ఆయన ఒకరు. తర్వాత ఆయన ప్రతిభను మెచ్చారేమో కానీ బయటకు పంపేశారు. ఆ తర్వాత ఆయన చానళ్లు.. యూట్యూబ్ పెట్టుకుని తెగ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఆయనకు పేటీఎం ముద్ర కూడా పడింది. ఆయనకు కష్టం వస్తే పేటీఎం డబ్బులు జమ చేసేవారు వచ్చి కలిసిపోతూంటారు. ఈ విషయం పక్కన పెడితే ఆయన విషయపరిజ్ఞానం కూడా ఈ కాలేజీకి బొక్కపడిందని ట్రాన్స్ లేట్ చేసినంత గొప్పగా ఉందని తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో తేలిసింది.
కియాకు షాక్ అంట – ఎందుకంటే జీరో బుకింగ్స్ క్యాన్సిలేషన్స్ట
సోమవారం పొద్దున్నే తన చానల్లో ప్రతిభా ప్రదర్శన చేశారు. కియాకు షాక్ అని ఓ స్టోరీ చదివేశారు. అందులో ఏముందంటే.. కియా కొత్త కార్నివాల్ మోడల్ రిలీజ్ చేసింది. దానికి జీరో బుకింగ్ కాన్సిలేషన్స్., కొనేవారు కరువయ్యారు. అంటూ పిట్టకథలు.. సామెతలు చెప్పారు. ఒక్క కారు కూడా కొనట్లేదని ఆయన చెబుతున్నారు. కానీ జీరో బుకింగ్స్‌కు.. జీరో బుకింగ్స్ కాన్సిలేషన్స్కు… ది హోల్ కాలేజీకి.,..కాలేజీకి పెద్ద బొక్క పడింది..అన్నంత తేడా అర్థం ఉంది.
కియా కార్నివాల్‌కు మంచి డిమాండ్
కార్నివార్ కొత్త వెర్షన్ కు మంచి డిమాండ్ ఉందని ఆటోమోబైల్ పరిశ్రమ వర్గాలు..ఆ పరిశ్రమకు చెందిన మీడియా చెబుతోంది. భారీగా ధరను నిర్ణయించినా…. ముందస్తు బుక్ చేసుకున్న వారు వెనక్కి తగ్గలేదు. రెండు శాతం మాత్రమే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇతర కార్లతో పోలిస్తే ముందస్తు బుకింగ్ క్యాన్సిలేషన్స్ చాలా తక్కువ. ఈ మోడల్ కువచ్చిన ఆదరణ చూసి కియా కంపెనీ కూడా సంతోషంగా ఉంది. పేటీఎం జర్నలిస్టు టర్న్డ్ నిశానీజర్నలిస్టు లైవ్‌లో తాను మాట్లాడుతూ చూపించిన ఫోన్ ఆర్టికల్ లో నూ అదే ఉంది. ఇక్కడ ఆయనకు కార్ల గురించి..కార్ల మార్కెట్ గురించి మాత్రమే కాదు… అసలు ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్ కూడాసరిగ్గా తెలియదని అర్థం అవుతుంది.
పేటీఎం డబ్బులకు బురద చల్లుకోక ఈ విషయాలెందుకు ?
జర్నలిస్టు సాయి అనే వ్యక్తికి కనీస నాలెడ్జ్ లేదని దశాబ్దాలుగా జర్నలిస్టుగా చేస్తున్నా ఐ క్యూ జీరో అని ఇలాంటివి నిరూపిస్తున్నాయి. ఆయనకు తెలిసిందల్లా డబ్బులు తీసుకుని బురద చల్లడమే . లేకపోతే వ్యూస్ కోసం ఎవరో ఒకర్ని మోయడమే. అలాంటి పనులు చేసుకోక మధ్యలో బిజినెస్ గోల ఎందుకు ?. గతంలో కెనడా యూరప్‌లో ఉందని చెప్పి పరువు తీసుకున్నారు. ఇప్పుడు ఇది. అయినా ఇలాంటివి ఈ జర్నలిస్టులు ఎంత తెలివి గలవాలో బయటపెడుతూ ఉంటాయి.