కాంగ్రెస్ హయాంలో చెన్నారెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డిలను ముఖ్యమమంత్రి పదవుల నుంచి తప్పించడనికి ఎలాంటి కుట్రలు చేశారో అలాంటివే ఇప్పుడు రేవంత్ ను దించడనికి జరుగుతున్నాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ పై కుట్రలు జరుగుతున్నాయో లేదో కాంగ్రెస్ నేతలే చెప్పాలని ఆయన అంటున్నారు.
హైదరాబాద్లో ఇటీవల మత కలహాలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరగడం అనంతరం.. బీజేపీ నేతలు ఈటల ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం సంచలనంగా మారింది. ఆ ర్యాలీలో కొంత మంది పోలీసులపై దాడులు చేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. అవి బీజేపీ కార్యకర్లు చేసినవి కావని ఎవరో తమ ర్యాలీలోకి చొరబడి రాళ్లు వేశారన్నారు. సీఎంలను మార్చడానికి మత కలహాలు రేపే కుట్రలు జరిగేది కాంగ్రెస్ పార్టీలోనేనన్నారు.
ఈటల రాజేందర్ తనను తాను సమర్థించుకునేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ .. కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారు మాత్రం ఈ ఘటనలను తేలిగ్గా తీసివేయలేరు. రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి మత రాజకీయాలు చేసే వారిని ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన మాటలు మరితం కటువుగా ఉండటంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఏదో జరుగుతోందని అనుకుంటున్నారు. అయితే చెన్నారెడ్డి, కోట్ల తరహాలో రేవంత్ ఉండరని.. ఆ రోజులు వేరు.. ఈ రోజులు వేరని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.