సాక్షి ఆఫీసుల్లో సీసీ కెమెరాలు చూసే వాళ్లకి ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి చేసిన కక్కుర్తి పని మాజీ స్పీకర్ తమ్మినేనిని జైలుకు పంపేలా చేస్తోంది. ఈ వ్యవహారం అసెంబ్లీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. అసెంబ్లీలో ఆడియో సిస్టమ్స్ నిర్వహణ చూసే టెండర్లలో తక్కువకు టెండర్ వేసిన కంపెనీని కాదని ఎక్కువ టెండర్ వేసిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దానికి స్వయంగా స్పీకర్ సంతకాలు చేశారు. ఇలా ఎందుకు చేశారో బ్యాక్ గ్రౌండ్ అంతా ఇప్పుడు బయటకు వచ్చింది.
స్వస్తిక్ అనే కంపెనీ సీసీ కెమెరాల నిర్వహణ చూస్తుంది. జగన్ రెడ్డి సాక్షి ఆఫీసులకు సీసీ కెమెరాలను చూస్తుంది. అయితే ప్రభుత్వం వచ్చాక సాక్షికి ప్రతి రూపాయి ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాలన్న పాలసీని ఉపయోగించారు. ఇప్పుడు ఆ కంపెనీకి డబ్బులు ఎలా చెల్లించాలా అని ఆలోచించి… అసెంబ్లీ సౌండ్ సిస్టం నిర్వహణ కాంట్రాక్టును.. సాక్షి ఆఫీసు సీసీ కెమెరాల నిర్వహణ ఖర్చులతో కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు ఎల్ వన్ గా నిలిచిన కంపెనీ కంటే ఎనిమిది లక్షలు ఎక్కువగా వేసి టెండర్ ఖరారు చేశారు. ఇంతా చేసిన స్వస్తిక్ కంపెనీకి సౌండ్ సిస్టమ్ల నిర్వహణలో అనుభవం లేదు. కానీ సాక్షి పత్రిక యాజమాన్యమే తమకు సౌండ్ పనులు చేశారని సర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ కక్కుర్తి పనికి తమ్మినేని సీతారాం సంతకం పెట్టారు. ఎల్ వన్ ను పక్కన పెట్టి ఎల్ వన్ కే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వచ్చాయి. కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. తమ్మినేని అవినీతి చేసి అరెస్టు కావడం వేరు… జగన్ రెడ్డి కక్కుర్తికి అరెస్టు కావడం వేరు. ఎంతైనా తమ్మినేనికి ఇలా జరగాల్సిందేనని ఆముదాల వలసలో నవ్వుకుంటున్నారు.