హైదరాబాద్ రియాలిటీ స్లంప్లోకి పోవడానికి మరో కారణం అనుమతులు రాకపోవడం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే ఏకంగా మూడు వందల కోట్లు తగ్గింది. భవన నిర్మాణ అనుమతులపై వసూలు చేసే రుసుము ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ రూ.1107.29 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
జీహెచ్ఎంసీ తాజా ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 20వతేదీ వరకు భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 750 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే అంతకుముందు ఏడాది తో పోలిస్తే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం గరిష్ట స్థాయికి చేరుకోగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆదాయం తగ్గుముఖం పట్టింది. విడ్ అనంతర సంవత్సరాల్లో నిర్మాణ పురోగతిని చూసిన హైదరాబాద్ నగరం ఇప్పుడు స్లంప్ను చూస్తోంది.
అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చిన్న విషయాన్ని చూసి ఏ లోపం లేకపోతేనే అనుమతులు ఇస్తున్నారు. ఒక వేళ అన్నీ కరెక్ట్ గా ఉన్నా సరే ఫలానా శాఖ నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని వెనక్కి పంపేస్తున్నారు. వీటన్నింటినీ కరెక్ట్ చేయకపోతే.. భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.