తెలుగుదేశం పార్టీ ముహుర్తం పెట్టి మరీ వైసీపీకి సవాళ్లు విసురుతోంది. గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల తరవాత వైసీపీ అంతా లోకేష్ .. లోకేష్ అని భయంతో కేకలు పెడతారని టీడీపీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఏదో పెద్ద విషయమే ఉందని టీజర్ ను బట్టి అర్థమవుతోంది. అయితే ఇదేమిటన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఖచ్చితంగా వైసీపీని ముఖ్యంగా జగన్ రెడ్డిని షేక్ చేసేదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ అదేంటో మాత్రం తెలిసి తెలియనట్లుగా టీడీపీ సీక్రెట్ మెయిన్ టెయిన్ చేస్తోంది.
జగన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటో రోజుకే బడా న్యూస్ వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ అలాంటివే. ఇప్పటికీ టీడీపీ జగన్ రెడ్డి హయాంలో జారీ చేసిన అనేక సీక్రెట్ జీవోలను బయట పెట్టలేదు. అన్నింటినీ జీవోఐఆర్లో పెట్టే అంశంపై కేబినెట్ లోనూ చర్చించారు. ఇలాంటివి ఏమైనా టీడీపీకి దొరికి ఉంటాయా అని వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. అయితే ఇది జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసే అంశమని ఆయన కూసాలు కదిలిపోయేంత గట్టిగా ఉటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అధికారం అందింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేసిన ప్రజా సంపదను వ్యక్తిగత ఆస్తి మాదిరిగా వాడుకున్నారు. ఈ వ్యవహారంలో ఏమైనా సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. దేని మీద బయట పెడతారో తెలిస్తే తాము కూడా ముందుగా కౌంటర్లు రెడీ చేసుకుంటాం కదా అని వైసీపీ వర్గాలు లీకుల కోసం. లీడ్స్ కోసం టీడీపీ మ్యూచువల్స్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరికీ తెలియడం లేదు.