ఓ ప్రముఖ టీవీ చానల్ ఓనర్ డ్రగ్స్‌కు పూర్తిగా అలవాటుపడిపోయారని పోలీసు వర్గాల నుంచి మీడియాకు లీక్ వచ్చింది. డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ పెడలర్లు దొరికినప్పుడు వినియోగదారుల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని వారిపై నిఘా పెట్టారు. ఈ నిఘాల్లో వెల్లడయిన సమాచారం లీక్ అయింది. ఇందులో టీవీ చానల్ ఓనర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఎలక్ట్రానిక్ మీడియా ఊపందుకుంటున్న సమయంలో చానల్ పెట్టిన ఆయన తండ్రి తన మార్కెటింగ్ నైపుణ్యంతో చానల్ ను నిలబెట్టారు. ఆయిల్స్ అమ్మి డబ్బు సంపాదించడంలోనూ వారిది ప్రత్యేకమైన శైలి. భారీగా ఆదాయం ఉన్న వారు చానల్‌ను కూడా లాభాల బాటలో నడిపించారు. ప్రస్తుతం ఆయన రోజువారీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఆయన కుమారుడే చానల్ ను నిర్వహిస్తున్నారు.
ఆయన డ్రగ్స్ కు ఎక్కడ అలవాటు పడ్డారన్నదానిపై మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హై ప్రోఫైల్ పార్టీలకు ఎక్కువగా వెళ్తూంటారని అక్కడే డ్రగ్స్ అలవాటు అయి ఉంటుందని అంటున్నారు. సస్పెక్ట్ లిస్ట్ బయటకు రావడంతో ఆయన జాగ్రత్తపడే అవకాశం ఉంది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరుగుతుంది. కేసులయ్యే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.