తల్లీ, చెల్లిపై జగన్ రెడ్డి కోర్టుకెళ్లడం సంచలనం రేపింది. తమ మధ్య ఇక ప్రేమాభిమానాలు లేవని అందుకే తాను గిఫ్ట్ డీడ్ గా రాసిచ్చిన షేర్లను తనకు ఇచ్చేయాలని ఎన్సీఎల్టీలో జగన్ వేసిన పిటిషన్ కాస్త కామెడీగా ఉన్నా జగన్ మనస్థత్వాన్ని మాత్రం పక్కాగా బయట పెడుతోంది. జనం విచిత్రంగా చూస్తారని తెలిసిన వాళ్లు కూడా అసహ్యించుకుంటారని తెలిసినా జగన్ కోర్టుకు వెళ్లడానికే మొగ్గుచూపారు.
దీనికి కారణం జగన్ చెప్పిన షరతుల్ని షర్మిల అంగీకరించకపోవడమేనంటున్నారు. గత సెప్టెంబర్ లో షర్మిల కి జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో ఆస్తులు పంచడానికి కొన్ని షరతులు విధించారు జగన్మోహన్ రెడ్డి. అందులో మొదటిది షర్మిల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తర్వాత అవినాష్ గురించి బాబాయి హత్య గురించి ఎక్కడ మాట్లాడకూడదు .మూడోది రాజకీయాలలో నా గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు భారతి గురించి కూడా మాట్లాడకూడదు అని . కానీ ఇంత జరిగిన తర్వాత షర్మిల అలాంటి షరతులకు అంగీకరించే అవకాశం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు.
దీంతో ఇప్పటికే గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తులను కూడా వెనక్కి తీసుకుంటానని బెదిరించేందుకు జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లారని చెబుతున్నారు. అయినా ఎన్సీఎల్టీ ఉన్నది గిఫ్ట్ డీడ్ గా ఇచ్చేసిన షేర్లను మళ్లీ వెనక్కి ఇప్పించడానికి కాదు. అయినా జగన్ కు అదో తుత్తి అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా జగన్ కు పరువు పోవడం తప్ప ఆ షేర్లు తిరిగి రావని బేసిక్ లా తెలిసిన వారు అంటున్నారు.