వైఎస్ బతికున్నప్పుడు ఆయన సంపాదించిన ఆస్తుల్ని పంచేశారని ఇప్పుడు షర్మిల అడుగుతున్నది జగన్ రెడ్డి సంపాదించిన ఆస్తులని .. ఆయన కష్టపడి సంపాదించుకున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి స్వార్జితం అనే మాట వింటే చాలా మంది ఆశ్చర్యపోతారు. అధికారం అండతో అక్రమంగా సంపాదిండం తప్ప జగన్ రెడ్డి నిజాయితీగా చేసిన వ్యాపారమే లేదు. వైఎస్ సీఎం కాక ముందు ఆయన ఆస్తి విలువ లక్షల్లోనే ఉండేది. తరవాత సూట్ కేసు కంపెనీలు పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని, వనరుల్ని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి వారి వద్ద నుంచి తన సూట్ కేసు కంపెనీల్లోని షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఆస్తులు పోగేశారు.
ఇదంతా బహిరంగరహస్యం, ఈడీ, సీబీఐ కూడా ఇదే చెప్పింది. వైఎస్ చనిపోయాక ఒక్కడు కూడా జగన్ రెడ్డి కంపెనీల్లో ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు. మళ్లీ జగన్ సీఎం అయ్యే వరకూ సాక్షికి..భారతి సిమెంట్స్ కు ఎందుకు లాభాల్లేవు అంటే… గుట్టు ఏమిటో తెలిసిపోదా. తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో మళ్లీ వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ సంస్థల్లోకి పంపింగ్ చేసుకుంది నిజం కాదా ? . ఇలా అడ్డగోలుగా దోచుకున్న సంపద కోసమే ఇప్పుడు ఇంట్లో కొట్లాటలు ప్రారంభమయ్యాయి. నా స్వార్జితం అని జగన్ రెడ్డి మొహమాటం లేకుండా చెబుతున్నారు.
దోచుకున్న సొమ్మును స్వార్జితం అని జగన్ రెడ్డి ఎలా చెబుతున్నారో … బహుశా దొంగతనాన్ని కూడా ఆయన కష్టంగా భావిస్తూ ఉండవచ్చు. తన ప్రతిభగా భావిస్తూ ఉండవచ్చు. మొత్తంగా జగన్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదాలు మొత్తం… సూట్ కేసు కంపెనీల్లో వచ్చిన క్విడ్ ప్రో కో వ్యవహారాల్లో సంపాదించిన దానిపైనే. అవన్నీ ఇప్పుడు ఈడీ అటాచ్ మెంట్లో కూడా ఉన్నాయి.