ప్రజల ఆశల్ని పెట్టుబడిగా మార్చుకుని కోట్లు కొట్టేసే కేటుగాళ్లకు కొదవే లేదు. హైదరాబాద్లో రోజుకో మోసం వెలుగు చూస్తోంది. రెండు రోజుల కిందట ఎల్పీనగర్లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ చేసిన మోసం గురించి ఇంకా మీడియాలో వస్తూండగానే స్క్వేర్ అండ్ యార్డ్స్ పేరుతో ఓ కంపెనీ పెట్టి లేని భూమిని అమ్మేసిన ఘరానా రియల్ ఎస్టేట్ మోసగాడి బాగోతం బట్టబయలు అయింది. స్క్వేర్ అండ్ యార్డ్స్ పేరుతో బైరా చంద్రశేఖర్ అనే వ్యక్తి కంపెనీ పెట్టారు. మరో ఇద్దర్ని పార్టనర్లుగా తీసుకున్నారు. విల్లా ప్టాట్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.
తక్కువ ధరకే విల్లా ప్లాట్లు అనే సరికి చాలా మంది ఆశపడిపోయారు. ఎవరిదో తెలియని స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ను చూపిస్తే ఆహా ఓహో ఆనుకున్నారు. ఇలా నమ్మిన వారందరి దగ్గర నంచి రూ. ఇరవై నాలుగు కోట్ల వరకూ వసూలూ చేశారు. ఇద్ పోలీసులకు చెప్పిన ఫిగర్. అంతకు మించి చెబితే తమకు ఎక్కడ ఐటీ సమస్యలు వస్తాయోనని కొంత మంది సైలెంట్ అయిపోయారు. ఎన్ని రోజులు అడిగినా విల్లాు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి డబ్బులచ్చిన వారు నిలదీశారు. దాంతో వారు ఇష్టం చ్చింది చేసుకోమన్నారు.
వారెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. వారం పది రోజుల తర్వాత బెయిల్ పై బయటకు వస్తారు. దర్జాగా తిరుగుతారు. ఏమైనా అడిగితే కేసు పెట్టారుగా కోర్టులో తేల్చుకుందాం అంటారు. అంటే డబ్బులు కట్టిన వాళ్లకు ఇక తిరిగి రానట్లే. అందుకే ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తక్కువకు వస్తాయని ఆశపడితే మొత్తానికే మోసం వస్తుంది.