పుణె వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టుబిగించింది. ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న న్యూజిలాండ్ 5 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. టామ్ లాథ్మ్ (86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం టామ్ బ్లండెల్ (30), ఫిలిప్స్ (9) క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్లో అదరగొట్టిన భారత్.. బ్యాటింగ్లో తేలిపోయింది. కేవలం 156 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేసి.. అప్పటికే ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో మ్యాచ్ ని తమవైపు తిప్పుకునే దిశగా కడులులుతోంది.
శనివారం కూడా ఇదే జోరు కొనసాగితే నాలుగు వందల పైచిలుకు టార్గెట్ ఇవ్వడం ఖాయం. ఆ టార్గెట్ కరిగించి టీం ఇండియా విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యపడదు.
స్వదేశంలో పెద్ద పులిలా విరుచుపడే టీమిండియా, న్యూజిలాండ్తో ప్రస్తుతం ఇస్తున్న ప్రదర్శన అభిమానులకు మింగుడు పడటం లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీకి ముందు ఇలాంటి ఆట తీరు భారత అభిమానులకు పెద్ద షాకే.