జగన్ రెడ్డిని కాకా పట్టి ఇష్టం వచ్చినట్లుగా భూములు కొట్టేసే ప్రయత్నం చేసిన స్వరూపాదనం అసలు పీఠం పేరుతో నిర్మించిన ఆలయాలు మొత్తం గెడ్డను ఆక్రమించి కట్టారని తేలింది. సుమారు ఇరవై సెంట్లు అంటే దాదాపుగా పన్నెండు వందల గజాలకుపైగా గెడ్డ స్థలంలో నిర్మాణాలు ఉన్నాయి. మిగతా స్థలం ఏమైనా ఆయన సొంతానిదా లేకపోతే ఎవరైనా విరాళంగా ఇచ్చారా అంటే ఎవరికీ తెలియదు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు.. ఆయన పూర్వికులు ఎవరో ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ కబ్జాలు చేసిన పీఠాలకు తన మేనల్లుడ్ని వారసుడ్ని చేశారు. కానీ ఆయనను కూడా తన మేనల్లుడుగా చెప్పుకోరు స్వరూపానంద.
ఆయన మొదట్లో బ్లాక్ టిక్కెట్లు అమ్మేవారని.. చినముషిడివాడలో ఉండేవారని … ఆ సమయంలో పూజల పేరుతో తాను నివాసం ఉంటున్న ఇంటి పక్క స్థలాన్ని కబ్జా చేసేశారు. మెల్లగా అక్కడ పూజాధికాలు నిర్వహిస్తూ.. ఆలయం కట్టేశారు. ఓ సమయంలో అప్పటి విశాఖ ఎంపీ సుబ్బరామిరెడ్డి పరిచయడం కావడం ఆయన మద్దతు లభించడంతో ఆయన ఆ స్థలాల్లో ఇక తిరుగులేకుండా నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత సుబ్బరామిరెడ్డిని కూడా పట్టించుకోవడం మానేశారు.
కబ్జాచేసిన స్థలంలో ఆలయాలు నిర్మిస్తే ప్రభుత్వాలు కూడా వాటి జోలికి రావని కొంత మంది నమ్మకం. నిజంగానే ప్రభుత్వాలు ఆలయాలను కూలగొట్టించేంత సాహసం చేయవు. ఇప్పుడు శారదాపీఠం విషయంలోనూ ప్రభుత్వం తన జోలికి రాదని .. స్వరూపానంద నమ్మకంతో ఉండి ఉంటారు.