రివ్యూ రైటర్లపై సినిమావాళ్లకు కోపాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే, సినిమాలోని తప్పొప్పుల్ని వాళ్లు ప్రస్తావిస్తారు కాబట్టి. సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమాపై విపరీతమైన ప్రేమ పెంచుకొని ఉంటారు. ‘సినిమా బాగుందండీ’ అని చెబితే అందరికీ సంతోషమే. కానీ అందులో తప్పులు ఎంచితే మాత్రం కోపాలు వచ్చేస్తాయి. హర్టయిపోతారు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా అలానే హర్టయ్యారు. ఆయన నటించిన ‘పొట్టేల్’ సినిమాకి సరైన రివ్యూలు రాలేదని ఆయన సభాముఖంగా వాపోయారు. రివ్యూ రైటర్లపై చిందులు తొక్కారు. ఆయన రివ్యూల్ని, రివ్యూ రైటర్లనీ విమర్శించడం వరకూ ఓకే. అది ఆయన భావ ప్రకటన. కానీ.. వాడిన పదజాలం మాత్రం సమర్థనీయం కాదు. ఇక్కడ ప్రస్తావించలేనంత నీచంగా ఆయన మాట్లాడిన విధానం సభ్యత అనిపించుకోదు.
నిజానికి శ్రీకాంత్ అయ్యంగార్ది ముందు నుంచీ దూకుడైన స్వభావమే. ఆయన చాలా విషయాల్లో ఇలానే నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడిస్తుంటారు. అంత వరకూ ఓకే. కానీ వాడే భాష చాలా ముఖ్యం. ఎంత చెత్త సినిమాలు చూసినా సరే, రెండున్నర గంటల పాటు రాచి రంపాలు పెట్టిన సినిమా చూసినా సరే, రివ్యూ రైటర్లు ఆయా సినిమాల్ని చీల్చి చెండాడే విధానం హుందాగానే ఉంటుంది. ఒకవేళ హద్దులు దాటినా, ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడిన మాటల కంటే, ఆయన ఉపమానాల కంటే చాలా ఉత్తమంగానే అనిపిస్తాయి. ‘పొట్టేల్’ సినిమాపై మంచి రివ్యూలే వచ్చాయి. కొన్ని తప్పులున్నా, లోటు పాట్లు కనిపించినా, మంచి ప్రయత్నమనే రివ్యూలన్నీ రాశాయి. దర్శకుడు కూడా ఈ ప్రెస్ మీట్ ప్రారంభంలో ‘మంచి రివ్యూలు వచ్చాయి. ఈమధ్య కాలంలో ఓ సినిమాకు, అందులోనూ చిన్న సినిమాకు యునామిస్గా మెచ్చుకొన్నది లేదు’ అంటూ రివ్యూ రైటర్లకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. కానీ శ్రీకాంత్ అయ్యంగార్ కు ఎక్కలేదేమో? అందుకే ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు సినిమాకు ఏమాత్రం మేలు చేకూర్చవు.
సినిమా ఎంత చెత్తగా ఉన్నా,
వాళ్లెంత దిగజారిపోయిన రివ్యూ రైటర్లయినా
ఇంత దారుణమైన భాష వాడి ఉండరు.రాసే ముందు రివ్యూ రైటర్లు భాషకు సంబంధించిన ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం ఎంత అవసరమో,
వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా తమ భాషని… pic.twitter.com/xVJHEl1SHf— Telugu360 (@Telugu360) October 26, 2024