జగన్ రెడ్డికి కట్టు బానిసలుగా మారిన టీవీ9, ఎన్టీవీ కనీసం షర్మిల తన వాదన వినిపిస్తున్న ప్రెస్ మీట్ ను చూపించడానికి కూడా భయపడుతున్నాయి. టీవీ9 అసలు షర్మిల అనే మాట రాకుండా జాగ్రత్త పడుతోంది. విజయవాడలో ఆమె పెట్టిన ప్రెస్ మీట్ లైవ్ ఇవ్వలేదు. యూట్యూబ్ లోనూ కనిపించనివ్వలేదు. ఇక ఎన్టీవీ మొదట లైవ్ ప్రారంభించింది. పై నుంచి వార్నింగ్లు వచ్చాయేమో కానీ మధ్యలో ఆపేసి.. అప్పటి వరకూ వచ్చిన లైవ్ ను కూడా ప్రైవేట్లో పెట్టేశారు.
షర్మిలను సాక్షిలో ఎలాగూ చూపించరు. జగన్ రెడ్డి, షర్మిల మధ్య రాజకీయ, ఆస్తుల వివాదాలు ఉన్నాయి. వాటిలో జగన్ రెడ్డి గురించి ఆయన ఇచ్చిన ఆస్తుల గురించి షర్మిల చేస్తున్న ప్రచారం జరిగింది తన వాదనను జగన్ వినిపిస్తున్నారు. కట్టు కథలు అల్లడంలో నిపుణులైన వారితో కథలు కథలు రాయిస్తున్నారు. వాటిని ఆయా మీడియాల్లో ప్రచారం చేయిస్తున్నారు. షర్మిలపై నిందలేస్తున్న చానళ్లు ఆమె వాదన వినిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. చూపించడానికి ఆసక్తి చూపించడం లేదు. క
ఒకప్పుడు టీడీపీ, జనసేన ఈవెంట్లు చూపించడానికి ఈ రెండు చానళ్లకు మనసు వచ్చేది కాదు. అయినా టీడీపీ కానీ జనసేన కానీ పట్టించుకోలేదు. జగన్ రెడ్డికి డబ్బా కొట్టి కొట్టి ఇప్పుడు సాక్షి 2, సాక్షి 3 చానళ్లుగా మారిపోయాయి. ఇప్పటికీ జగన్ రెడ్డి అంటే భయభక్తులతోనే ఈ రెండు చానళ్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి.