విజయవాడ ఎయిర్ పోర్టుకు నాలుగు నెలల్లోనే మహర్దశ వచ్చేసింది. గతంలో జగన్ రెడ్డి ప్రైవేటు విమానాశ్రయంలా ఉండేది . వచ్చిపోయే సర్వీసులు చాలా తక్కువ. కానీ ప్రభుత్వం మారిన నాలుగు నెలల్లోనే సర్వీసులు రెట్టింపు అయ్యాయి. తాజాగా విశాఖకు కూడా రెండు సర్వీసుల ప్రారంభమవుతున్నాయి.
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు విజయవాడకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఇచ్చారు. ఆ సమయంలో ఏపీలో వ్యాపార వ్యవహారాలు, అమరావతి అంశం కోసం పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు ఏపీకి వచ్చే వారు. ఏపీకి వచ్చి పోయే వారి సంఖ్య భారీగా ఉండటంతో ఫైట్ సర్వీసులు కూడా భారీగా పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా సింగపూర్, షార్జాకు నేరుగా సర్వీసులు ఉన్నాయి. అయితే వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తరవాత ఏపీకి వచ్చే వారు కరువయ్యారు. ఓ దశలో రోజుకు పది సర్వీసులు వచ్చినా గొప్పే అన్నట్లుగా మారింది.
ఇప్పుడు మళ్లీ ఆర్థిక వ్యవహారాలు పుంజుకుటున్నాయి. గత నాలుగు నెలల కాలంలో దేశంలో వివిధ ప్రాంతాలకు సర్వీసులు పెరిగాయి. విశాఖ, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలకు కనెక్టివిటీ పెరిగింది. ఇదంతా అభివృద్ధికి సూచిక. గతంలో పెట్టుబడులు, వ్యాపారాలను జగన్ ప్రోత్సహించలేదు. సొంత వ్యాపారాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయన కోసం వచ్చే వారికి మాత్రమే ఎయిర్ పోర్టు ఉపయోగపడేది ఇప్పుడు ప్రజల కోసం ఉపయోగపడుతోంది.