తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐదుగురు ఐఏఎస్‌లలో నలుగురికి పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వంత. ఏపీ టూరిజం ఎండీగా కాట ఆమ్రపాలిని నియమించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణీమోహన్. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌కు వారి సీనియార్టీలకు తగ్గట్లుగా ప్రాధాన్యత ఉన్న పోస్టులే ఇచ్చారు. మరో అధికారి రోనాల్డ్ రోస్కు ఇంకా పోస్టింగ్ కేటాయించాల్సి ఉంది.
కాట అమ్రపాలికి పవన్ కల్యాణ్ పేషిలో పోస్టింగ్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అదంతా సోషల్ మీడియా ఔత్సాహికుల ప్రచారమే. ఖాళీగా ఉన్న పోస్టులు, అధికారుల సమర్థతను చూసి పోస్టింగులు ఖరారు చేస్తారు. ఈ క్రమంలో టూరిజంకు ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం… సమర్థంగా ముందుకు తీసుకెళ్లగరన్న అంచనాలతో అమ్రపాలికి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన అధికారులు అమ్రపాలి కన్నా సీనియర్లు. వారికి వారి సీనియార్టీకి తగ్గట్లుగా ప్రాధాన్యత కలిగిన పోస్టులు లభించాయి.
తెలంగాణ నుంచి ఐపీఎస్ అధికారులు కూడా ఏపీకి రావాల్సి ఉంది. మాజీ డీజీపీ అంజనీకుమార్ కూడా ఏపీ క్యాడర్ కు కూడా రావాల్సి ఉంది. కానీ వారు ఇంకా తెలంగాణ నుంచి రిలీవ్ కాలేదు.