ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇఎంఎస్ నంబూద్రిపాద్, బూర్గుల రామకృష్ణారావు,నందినీ శథపథి పివినరసింహారావు వాజ్‌పేయి వంటి రాజకీయ వేత్తలు మంచి రచయితలుగానూ పేరు తెచ్చుకున్నారు. కాని తర్వాతి కాలంలో మీడియా విస్తరణ కారణంగానేమి రాజకీయ రంగంలో పరుగుల కారణంగా నేమి ఈ ధోరణి బాగా తగ్గింది. ఇటీవలి కాలంలో బుద్ధదేవ్ భట్టాచార్య నవీన్ పట్నాయక్ వంటివార్ల పేర్లు ఈ జాబితాలో వినిపించాయి. కెసిఆర్ కూడా పాటలు రాసి మెప్పించారు. ఇంకా చాలాపేర్లు చెప్పొచ్చు గాని ఇక్కడకి ఆపేద్దాం. సందర్భం ఏమంటే ఈమధ్య కాలంలో అధికార అనధికార ప్రముఖుల పేరిట పత్రికలలో వ్యాసాలు రావడం పెరిగింది. వారిలో ముందుగా చెప్పుకోవలసింది కేంద్ర మంత్రి బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు. చాలా ఎక్కువగానే ఈ మధ్య రాస్తున్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టిఆర్ఎస్ ఎంపలుి వినోద్ కుమార్, డా.బూరా నర్సయ్య, టిడిపి ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి , సిపిఐ నాయకులు నారాయణ వంటివారు కూడా తరచూ కాలమ్స్‌లో కనిపిస్తున్నారు.కెసిఆర్ అయితే కొంతమందిని ప్రత్యేకంగా ప్రోత్సహించి తమ ప్రభుత్వం పార్టీల అభిప్రాయాలు రాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి వెళ్లిన బిసి నేత వకుళాభరణం కృష్ణమోహనరావు పేరు ఎక్కువగా కనిపిస్తున్నది. హరీష్ రావు కూడా ఉద్యమ కాలంలో రాసేవారు గాని ఇప్పుడు ఆయన సహాయకులు రాస్తుంటారు. మొత్తంపైన టీవీలు ప్రధానం అనుకుంటున్న కాలంలోనూ పత్రికల ప్రాధాన్యతను మళ్లీ గుర్తించి రావడం మంచి విషయమే. టీవీ చర్చలకు వచ్చే ప్రతినిధులకు కూడా రెండు రాష్ట్రాల అధినేతలు బాగానే శిక్షణ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మరోకోణం . అది ఆయా నేతల స్పందనల తీరు మరెప్పుడైనా చెప్పుకోవచ్చు